చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

ఇన్నేళ్ల స్వంతంత్య్ర భారత దేశంలో పాకిస్తాన్ చేసే దాడులను కాచుకోవడం.. ఆ దేశం పంపే ఉగ్రవాదుల చర్యలను మౌనంగా భరించడమే భారత్ చూసింది. కానీ బీజేపీ వచ్చాక కాస్తా మార్పు వచ్చింది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వదిలేసి రెండు చెంపలపై వాయ గొట్టాలన్న బీజేపీ ఉడుకునెత్తురు సిద్ధాంతం దేశ ప్రజల్లోకి ఎక్కింది. ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి విమానాలను పంపి మరీ దాడులు చేయగల పోరాట పటిమను బీజేపీ ప్రభుత్వం పుణికిపుచ్చుకుంది. […]

Written By: NARESH, Updated On : June 24, 2020 3:31 pm
Follow us on


ఇన్నేళ్ల స్వంతంత్య్ర భారత దేశంలో పాకిస్తాన్ చేసే దాడులను కాచుకోవడం.. ఆ దేశం పంపే ఉగ్రవాదుల చర్యలను మౌనంగా భరించడమే భారత్ చూసింది. కానీ బీజేపీ వచ్చాక కాస్తా మార్పు వచ్చింది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వదిలేసి రెండు చెంపలపై వాయ గొట్టాలన్న బీజేపీ ఉడుకునెత్తురు సిద్ధాంతం దేశ ప్రజల్లోకి ఎక్కింది. ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి విమానాలను పంపి మరీ దాడులు చేయగల పోరాట పటిమను బీజేపీ ప్రభుత్వం పుణికిపుచ్చుకుంది. ఎప్పుడూ ఇతర దేశాలపైకి వెళ్లని భారత్ తొలిసారి పాకిస్తాన్ లోకి వెళ్లి మరీ బాంబులు వేసి వచ్చింది. ఇది ఇన్నేళ్ల చరిత్రలోనే భారత్ సాధించిన అరుదైన సాహసం అని చెప్పవచ్చు.

తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా చేతిలో 20మంది భారత జవాన్ల మృతికి మోడీనే కారణమని.. సరిహద్దుల్లో ఏం జరిగిందో బయటపెట్టాలని నినదించారు. ప్రతిపక్షాలు కూడా మోడీని చైనాతో డీల్ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించాయి. అందరూ వేలెత్తి చూపినా కూడా మోడీనే దేశ ప్రజలు నమ్ముతున్నట్టు తాజా సర్వేలో తేలింది.

చైనాతో ఫైట్ లో 20 మంది భారత సైనికులు మరణించినా కూడా ప్రధాని నరేంద్రమోడీకే దేశ ప్రజలు మద్దతునిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. చైనాకు వ్యతిరేకంగా పోరాడడానికి.. నాయకత్వం వహించడానికి మోడీ సరైన వ్యక్తి అని భారత ప్రజలు భావిస్తున్నారు. నరేంద్రమోడీ చేతిలోనే భారత్ సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

భారత్ -చైనా ఉద్రికత్తల నేపథ్యంలో ఇటీవల ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ ఏబీపీ-సీఓటర్ కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోడీ నాయకత్వంలోనే భారత్ సురక్షితంగా ఉంటుందని దాదాపు 72.6శాతం మంది ప్రజలు అభిప్రాయపడడం విశేషం.ఇక చైనాతో ఇలాంటి ఘర్షణ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చక్కగా నిర్వహించగలరని 14.4శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదని 39శాతం మంత్రి అభిప్రాయపడ్డారు.

ఆసక్తికర విషయం ఏంటంటే పాకిస్తాన్ కంటే కూడా చైనానే భారత్ కు అతిపెద్ద శత్రువుగా చూస్తున్నారు. పాకిస్తానే భారత్ కు నంబర్ 1 శత్రువు అని కేవలం 32శాతం మంది అభిప్రాయపడగా.. చైనానే ప్రధాన శత్రువు అని ఏకంగా 68శాతం మంది చెప్పడం విశేషం. చైనా ఉత్పత్తులను నిషేధించాలని చాలా మందిగా గట్టిగా సమర్థించారు.31శాతం మంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయమని తెలిపారు.

దీన్ని బట్టి పాకిస్తాన్ కానీ.. చైనా కానీ భారత్ ధీటుగా ఎదురించాలన్నా.. వాటితో ఫైట్ చేయాలన్నా ప్రధాని మోడీనే సరైనవాడు అని.. ఆయన నాయకత్వంలోనే వాటితో సరిగా డీల్ చేస్తున్నారని.. భారత్ పూర్తిగా మోడీకే మద్దతుగా ఉందని తాజా సర్వేతో తేటతెల్లమైంది.

-నరేశ్ ఎన్నం