ఏపీకి గుడ్ న్యూస్: పోలవరం అంచనాలు సవరించి ఆమోదించిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అందింది. కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఏపీకి తీపి సమాచారం చెప్పింది. వైసీపీ ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలు చేశారు. అన్నింటికి జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని మంత్రి గజేంద్ర షెకావత్ కు వైసీపీ ఎంపీలు విన్నవించారు. నిర్వాసితులకు 2013 […]

Written By: Srinivas, Updated On : July 29, 2021 11:23 am
Follow us on

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అందింది. కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఏపీకి తీపి సమాచారం చెప్పింది. వైసీపీ ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలు చేశారు. అన్నింటికి జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని మంత్రి గజేంద్ర షెకావత్ కు వైసీపీ ఎంపీలు విన్నవించారు.

నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని పేర్కొన్నారు. షరతులు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ అందజేయాలని మంత్రిని కోరారు. మొత్తం ఐదు అంశాలపై కేంద్రమంత్రితో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడులపై అన్ని విషయాలు క్లియర్ చేయాలని సూచించారు. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని విన్నవించారు. కమిటీ సూచనల మేరకు రూ.47,725 కోట్టు విడుదల చేస్తామన్నారు.

బిల్లుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఎస్క్రో ఖాతా తెరవాలని సూచించారు. అయితే అది సాధ్యం కాదని, వారం పది రోజుల్లో రీయింబర్స్ మెంట్ చేస్తామని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ ఇప్పుడు ఆ అంచనాలకు ఆమోదం తెలపడంతో పనులు మరింత వేగంగా జరిగే అవకాశముంది. దీంతో కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఆమోదయోగ్యమైన పనులకు అనుకూలమైన అంశాలుండడంతో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.