ఏపీలో వైఎస్సార్ జనతా బజార్లు!

రాష్ట్రంలో పండించిన పంటలను బయట మార్కెట్లకు పంపించడమే కాకుండా స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపి తక్కువ ధరకే ప్రజలకు అమ్ముతున్నామని చెప్పారు. ఈ ఆలోచన వెయస్సార్‌ జనతా బజార్లకు దారితీస్తుందన్నారు. వచ్చే ఏడాదిలోగా ఈ బజార్లకు రూపకల్పన చేస్తున్నట్లు […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 6:50 pm
Follow us on


రాష్ట్రంలో పండించిన పంటలను బయట మార్కెట్లకు పంపించడమే కాకుండా స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపి తక్కువ ధరకే ప్రజలకు అమ్ముతున్నామని చెప్పారు. ఈ ఆలోచన వెయస్సార్‌ జనతా బజార్లకు దారితీస్తుందన్నారు. వచ్చే ఏడాదిలోగా ఈ బజార్లకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్తు కారణంగా మనం తీసుకునే చర్యల రూపంలో వైయస్సార్‌ జనతాబజార్లకు బీజం వేశామని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలన్నారు. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చని, లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్‌డౌన్‌ ఉద్దేశాలు నెరవేరవన్నారు. హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచిందని చెప్పారు.

క్వారంటైన్‌లో ఉన్న వారికి మంచి సదుపాయాలు కల్పించాలని కోరారు. పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌ మెంట్‌ చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలని, ఎవరైనా పేషెంట్‌ వస్తే… అతనికి కరోనా ఉందా? లేదా? అన్నది ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు.

రైతులు ఇబ్బంది పడకుండా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదని, ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వమని ఆదేశించారు. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదన్నారు. మొదటిసారి ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే వెంటనే ఆ సమాచారం రావాలని సూచించారు.
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తనకు ఇచ్చిన ట్యాబ్‌ ద్వారా ఈ సమాచారాన్ని నివేదించాలని, ఈ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలన్నారు.

ఆక్వా రంగంపై ఆక్వా అసిస్టెంట్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలన్నారు. వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ఆర్బీకేలు జూన్‌ నుంచి పనిచేయాలని, 2021 మార్చి నాటికి ఇవి పూర్తికావాలని సూచించారు.