వైఎస్ జగన్.. ఏ బిజినెస్ పాలిటిక్స్

సంప్రదాయ రాజకీయాలకు దూరంగా మోడ్రన్ బిజినెస్ టెక్నిక్స్ తో రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయా అనుభవాన్ని తుత్తునియలు చేస్తూ ఫస్ట్రేషన్ కు గురిచేస్తున్నారు. ప్రతీది పక్కా లెక్కతో చేయడం జగన్ కు అలవాటు అంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారట.. ఏపీలో టీడీపీని నీరుగార్చడం కోసం దిగ్గజ టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు వారికి నియోజకవర్గాలు కేటాయించేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. నియోజకవర్గాల పెంపుదలకు పక్కా […]

Written By: NARESH, Updated On : April 27, 2021 9:47 am
Follow us on

సంప్రదాయ రాజకీయాలకు దూరంగా మోడ్రన్ బిజినెస్ టెక్నిక్స్ తో రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయా అనుభవాన్ని తుత్తునియలు చేస్తూ ఫస్ట్రేషన్ కు గురిచేస్తున్నారు. ప్రతీది పక్కా లెక్కతో చేయడం జగన్ కు అలవాటు అంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారట..

ఏపీలో టీడీపీని నీరుగార్చడం కోసం దిగ్గజ టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు వారికి నియోజకవర్గాలు కేటాయించేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. నియోజకవర్గాల పెంపుదలకు పక్కా స్కెచ్ గీస్తున్నారు. ఎలాగైనా సరే భారీగా పెంచుకొని కొత్త నేతలకు అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. అదే జరిగితే జగన్ కు సమస్యలు తీరి పార్టీలో అసమ్మతికి చెక్ పడుతుంది. ఈ మేరకు కేంద్రంతో సయోధ్యతో దీన్ని సాధించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం జగన్ దీని మీదే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

కొత్త నియోజకవర్గాల పునర్విభజన 2026లో మాత్రమే జరుగుతుంది. కానీ ఏపీ విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పెంపుకు కేంద్రం హామీ ఇచ్చింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు వాటిని చేయాలని జగన్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికలకు ముందు దీన్ని చేసి టికెట్ల గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నారట..

ఏపీలో ఇప్పుడున్న 175 నియోజకవర్గాల నుంచి 225 అసెంబ్లీ స్థానాలకు పెరుగుతాయి. దాన్ని సాధించాలని మోడీ, అమిత్ షాలను కలిసినప్పుడు వినతిపత్రాలు ఇస్తూ జగన్ ఒత్తిడి తెస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీలో టీడీపీ నుంచి కొత్త నేతలు.. అనాధిగా వైసీపీని నమ్ముకొని ఉన్న పాత నేతల మధ్య నియోజకవర్గాల్లో పోరు నడుస్తోంది. ప్రధానంగా ఈ సమస్య ఎస్సీ నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉందట.. దీంతో ఎన్నికలలోపు ఖచ్చితంగా నియోజకవర్గాల విభజన చేసి సమస్యను క్లియర్ చేసి మరోసారి గెలవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.