Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ఏదో ఉచ్చు...

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ఏదో ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు స్వయాన బాబాయ్. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికల ముందు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో రాజకీయ హత్యగా పేర్కొంటూ వైసీపీ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందింది. సానుభూతి కోణంతో పాటు నారాసుర రక్తచరిత్ర అంటూ హత్యకు పాల్పడింది అప్పటి టీడీపీ సర్కారేనంటూ సాక్షిలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకూ కేసు కొలిక్కి రాలేదు. అసలు నిందితులు పట్టుబడలేదు. కేవలం అనుమానితులు, అభియోగం మోపబడిన ఒకరిద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ లో ఉంచారు. అయితే సీబీఐ నత్తనడకన దర్యాప్తు పై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ వేగం పెంచింది.ఏకంగా జ‌గ‌న్ ఇంటిని ప‌రిశీలించి కొల‌త‌లు తీసుకున్నారు. జ‌గ‌న్ ఇంటితోపాటు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ద‌స్త‌గిరి, ఉమాశంక‌ర్‌రెడ్డి, సునీల్ యాద‌వ్ నివాస ప్రాంతాల‌ను కూడా అధికారులు ప‌రిశీలించారు. స‌ర్వేయ‌ర్ల‌తో ఇంటి కొల‌త‌లు తీయించారు. ఇప్ప‌టివ‌ర‌కు వివేకా హ‌త్య‌కేసులో ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగాకానీ జ‌గ‌న్ ఇంటివైపు సీబీఐ అధికారులు వెళ్ల‌లేదు. ఇప్పుడు అక‌స్మాత్తుగా సీఎం జగన్ ఇంటి కొల‌త‌లు తీయించ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది.

YS Viveka Murder Case
YS Viveka, CBI

‘కీ’లక వ్యక్తి ఎవరు?
వివేకా హత్య కేసుకు విచారణకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడితే.. మూడడుగుల వెనక్కి అన్న చందంగా సీబీఐ వ్యవహారం నడిచింది. కేసులో అతి ‘కీ’లకమైన వ్యక్తి ఒకరున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఆమె హస్తం ఉందన్న టాక్ నడిచింది. దీంతో కేసు నెమ్మదించిందని కూడా పులివెందుల సర్కిల్ లో టాక్ నడిచింది. దాదాపు మూడేళ్లవుతున్నా కొలిక్కి రాకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.

Also Read: TDP BJP Alliance: మోడీని టెంప్ట్ చేసే ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..? జనసేన పరిస్థితేంటి?

అయితే దీనిపై విమర్శలు చుట్టుముడుతున్న తరుణంలో సీబీఐ కేసు విచారణలో దూకుడు పెంచింది. ఈ క్రమంలో కొందరు సీబీఐ అధికారులను, సిబ్బందిని సైతం బెదిరించారు. దీంతోపాటు అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై పోలీస్ కేసులు న‌మోదు చేశారు. ఈ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలించిన సీబీఐ అధికారులు కేసును కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ప‌రిశీలించడానికి దారితీసిన ప‌రిస్థితులేమిట‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు. దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు సీబీఐ సీరియస్ గా రంగంలోకి దిగిందన్న వాదనా ఉంది.

YS Viveka Murder Case
YS Viveka, CBI

సీరియస్ గా విచారణ
వివేకానంద‌రెడ్డి పీఏ ఇన‌య‌తుల్లాను సీబీఐ అధికారులు రెండు విడ‌త‌లుగా విచారించారు. మంగళవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఇన‌య‌తుల్లాను పులివెందుల‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి పిలిపించిన అధికారులు ఆయ‌న‌తోపాటు ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్‌, ఒక ప్ర‌యివేట్ ఫొటోగ్రాఫ‌ర్‌, వీఆర్‌వోను వెంట‌పెట్టుకొని ప‌లు ప్రాంతాల్లో క‌లియ‌తిరిగారు. అవినాష్‌రెడ్డి ఇంటి బ‌య‌ట స‌ర్వే నిర్వ‌హించారు. దీంతోపాటు వాచ్‌మెన్ రంగ‌న్న ఇల్లు, దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఆసుప‌త్రి, పాత ఆసుప‌త్రిబ‌య‌ట‌, వైసీపీ కార్యాల‌యంతోపాటు ప‌లు ప్ర‌దేశాల్లో స‌ర్వే నిర్వ‌హించారు.వివేకా ఇంటిలో గంట‌న్న‌ర ప‌రిశీల‌న‌ స‌ర్వే నిర్వ‌హించే స‌మ‌యంలో ఫొటోలు, వీడియోలు అధికారులు తీయించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇంటివ‌ద్ద కూడా స‌ర్వే నిర్వ‌హించిన అనంత‌రం ఇంట్లోకి వెళ్లి దాదాపు గంట‌న్న‌ర‌పాటు కూలంకుషంగా ప‌రిశీలించారు. మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు తిరిగి ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే క‌డ‌ప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి జైలులో త‌న‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాల‌ని జిల్లా సెష‌న్స్ కోర్టులో పిటిష‌న్ వేశారు. వాస్త‌వానికి దీనిపై మంగ‌ళ‌వార‌మే తీర్పు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ గురువారానికి వాయిదా ప‌డింది. వివేకా హ‌త్య‌కేసులో శంక‌ర్‌రెడ్డి ఏ-5గా రిమాండ్‌లో ఉన్నారు.

Also Read:Pawan Kalyan 3 Options పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సిన పని ఇదే!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular