YS Sharmila : జల జగడంలో షర్మిల ఎటువైపు?

YS Sharmila : తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైంది. ఈ వివాదాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఏపీలోని జగన్ సర్కార్ కు మేలు చేసేలా కెసిఆర్ నాడు నిర్ణయాలు తీసుకున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిపై పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి. నాడు తెలంగాణలోని వైయస్సార్సీపీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రస్తావించారు. ఉభయ రాష్ట్రాల సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను సజీవంగా ఉంచేందుకు కేసిఆర్ ప్రయత్నించారని ఒక విమర్శ ఉంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ఏపీ సర్కార్ నాగార్జునసాగర్ పై దండయాత్ర చేసింది. అది పోలింగ్ లో కేసీఆర్ కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం అని కాంగ్రెస్ ఆరోపించింది. ఒకవేళ అధికారం కోల్పోతే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంతో మళ్లీ అధికారంలోకి రావాలని కెసిఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఉభయతారకంగా ఉంటుందని నాడు జగన్ తో సాగర్ డ్యాం పై దండయాత్ర చేయించారని కెసిఆర్ పై కాంగ్రెస్ కు అనుమానం ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడాన్ని తప్పుపడుతూ కెసిఆర్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో రేవంత్ అప్రమత్తమయ్యారు. జగన్ తో రాజకీయ ప్రయోజనాల కోసం చేసుకున్న ఒప్పందాలను బయట పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీకి ఎలా లాభం చేకూరింది.. తెలంగాణ ఎలా నష్టపోయింది.. వంటి సమగ్ర వివరాలతోపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

అయితే దీనిపై జగన్ సర్కార్ నోరు మెదపడం లేదు. కనీసం స్పందించిన దాఖలాలు లేవు. మరోవైపు కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ తన అంగీకారం తెలిపారు అన్న ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. నాడు సీఎంలు గా ఉన్న కేసీఆర్, జగన్ మధ్య జరిగిన ఒప్పందాలను సభలో వివరించారు. అయితే విభజన హామీలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య జల జగడం జరుగుతోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏపీకి ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని నాడు ఆరోపించారు.చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే విమర్శలు చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తెలంగాణ సర్కారు వాదనను అంగీకరిస్తారా? ఎలా రియాక్ట్ అవుతారు అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

Get notified whenever we post something new!

Continue reading

Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి..

Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version