Raja Reddy Marriage: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, మత బోధకుడు అనిల్ కుమార్ కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఘనంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో ఆదివారం సాయంత్రం క్రైస్తవ పద్ధతిలో వైయస్ రాజారెడ్డి, ప్రియా వివాహం జరిగింది. అంతకు ముందు రోజు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ప్రియా కుటుంబం హిందూ సంప్రదాయాన్ని పాటిస్తుంది. అందుకే ముందుగా వారి కుటుంబ ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు. షర్మిల కుటుంబం క్రైస్తవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది కాబట్టి మాసిటి రోజు ఆ విధానంలో పెళ్లి జరిపించారు..
తన కోడలు, కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి వైఎస్ షర్మిల ట్విట్టర్ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో విశాలమైన జోద్ పూర్ ప్రాంతంలోని ఉమైద్ ప్యాలెస్ పూలతో అలంకరించి ఉండగా.. ముందుగా షర్మిల, భర్త అనిల్, మధ్యలో వారి కుమారుడు రాజారెడ్డి రాగా.. తర్వాత ప్రియా అట్లూరి తన తల్లి, తండ్రి తో కలిసి బయటికి వచ్చారు. నూతన వధూవరులు అధునాతన వస్త్రాలతో మెరిసిపోతూ వివాహ వేదిక వద్దకు రాగా.. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం క్రైస్తవ మత బోధకులు ప్రార్థనలు జరుగుతుండగా వాటిని ఆసక్తిగా విన్నారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. వైయస్ విజయలక్ష్మి, ప్రియా అట్లూరి తరఫు బంధువులు, ఇతర సన్నిహితులు వివాహ వేడుకలో సందడి చేశారు. వైయస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు.. వివాహానికి మాత్రం హాజరు కాలేదు.
ఇక ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో చేసిన వైఎస్ షర్మిల.. తన కుమారుడి వివాహానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.” ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా ఈ అందమైన జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. నా తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గం నుంచి ఆయన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్టు నేను అనుభూతి చెందాను. అద్భుతమైన ఈ సందర్భంగా మా హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అపరిమితమైన ఆనందం, ఒకరికొకరు అనంతమైన ప్రేమను పంచుకుంటూ.. అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించాలని నేను ఈ జంటను అభినందిస్తున్నానని” షర్మిల రాస్కొచ్చారు.. వివాహ వేడుకలకు సంబంధించి గత బుధవారమే షర్మిల తన కుటుంబంతో కలిసి జోధ్ పూర్ వచ్చారు. శుక్రవారం సంగీత్ మెహందీ, శనివారం సాయంత్రం ఐదు గంటల వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం ఇరు కుటుంబాల వారు హైదరాబాద్ బయలుదేరుతారు. త్వరలో నూతన జంటకు సంబంధించి వివాహ విందును హైదరాబాద్ లేదా విజయవాడలో ఏర్పాటు చేస్తారు.
The most beautiful couple, made for each other, steps into the marital bliss, and I could feel my father, Late Dr YSR showering his blessings from the Heaven. Solemn, yet splendid, the occasion is here to be etched on our hearts forever. I greet the couple that they be blessed… pic.twitter.com/3MAYhKpBcY
— YS Sharmila (@realyssharmila) February 18, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ys sharmila son raja reddy and priya atluri marriage video goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com