Homeజాతీయ వార్తలుఅప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్

అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్

Sharmilaవైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిగూడ, అల్మాస్ పూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలను పరామర్శించారు. కరోనా వచ్చినా పట్టించుకునే వారే లేరని దుయ్యబట్టారు. వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని పేర్కొన్నారు. అప్పులు చేసి రోడ్డున పడడానికి కారణం ప్రభుత్వమేనని తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా బిల్లులు రాక అప్పుల పాలు కావడంపై విమర్శించారు.

ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనా బారిన పడి కుటుంబాలు కుదేలయ్యాయయని దుయ్యబట్టారు. సామాన్యుడికి రూ.10 నుంచి 20 లక్షల బిల్లు వేస్తే వారు ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. చివరికి శవాలను తీసుకెళ్లాలన్నా బిల్లు కట్టనిదే తీసుకెళ్లనీయలేదని వాపోయారు.0

సీఎం మాత్రం ఆయనకు కరోనా సోకితే యశోదకు పోయి చికిత్స తీసుకున్నారని తెలిపారు. కానీ సామాన్యులు మాత్రం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని చెప్పారు. కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా విజృంబిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదని చెప్పారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి అందరికీ తెలిసిందేనన్నారు. ఆయనపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అరుట్ల విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని కరీంనగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా షర్మిల పరామర్శించారు. ఎల్లారెడ్డిగూడ మండలం పదిరె గ్రామంలో ఉన్న విక్రమ్ కుటుంబసభ్యులను షర్మిల కలిశారు. వారి కటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version