సాక్షి చానెలా? నిండు సభలో షాకిచ్చిన షర్మిల

అంతే అంతే.. మరీ.. రాజకీయాల్లోకి వచ్చాక.. ‘అన్నయ్య.. అన్నయ్యే .. రాజకీయాలు రాజకీయాలే..’ ఎక్కడా తగ్గేది లేదు. సొంత చెల్లెలు తెలంగాణలో పార్టీ పెట్టినా పక్క రాష్ట్ర సీఎం జగన్ సహించడం లేదని షర్మిల సభ సాక్షిగా బయటపడింది. కాదు కాదూ… బయటపెట్టేసింది షర్మిల. ఔను ఒకే ఒక్క సంఘటనతో ఈ అన్నాచెల్లల అనుబంధం తేటతెల్లమైంది. ఏపీ సీఎం జగన్ తో చెల్లెలు వైఎస్ షర్మిలకు సరైన సయోధ్య లేదని నిరూపితమైంది. అది షర్మిల నిర్వహిస్తున్న నిరసన […]

Written By: NARESH, Updated On : April 15, 2021 5:10 pm
Follow us on

అంతే అంతే.. మరీ.. రాజకీయాల్లోకి వచ్చాక.. ‘అన్నయ్య.. అన్నయ్యే .. రాజకీయాలు రాజకీయాలే..’ ఎక్కడా తగ్గేది లేదు. సొంత చెల్లెలు తెలంగాణలో పార్టీ పెట్టినా పక్క రాష్ట్ర సీఎం జగన్ సహించడం లేదని షర్మిల సభ సాక్షిగా బయటపడింది. కాదు కాదూ… బయటపెట్టేసింది షర్మిల. ఔను ఒకే ఒక్క సంఘటనతో ఈ అన్నాచెల్లల అనుబంధం తేటతెల్లమైంది. ఏపీ సీఎం జగన్ తో చెల్లెలు వైఎస్ షర్మిలకు సరైన సయోధ్య లేదని నిరూపితమైంది.

అది షర్మిల నిర్వహిస్తున్న నిరసన సభ. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ఎదుట ధర్నా చౌక్. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఈరోజు పొద్దంతా షర్మిల నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఆర్. కృష్ణయ్య సహా కొందరు మేధావులు, సంఘాల నేతలు వచ్చి ఆమెకు సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ లేవనెత్తని నిరుద్యోగుల వెతను షర్మిల పట్టుకొని వారి మనసులు చూరగొంటోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ సైతం ఇక ఉద్యోగ ప్రకటనలకు రెడీ అయ్యింది.

అయితే షర్మిల దీక్షలో ప్రసంగిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చోటుచేసుకుంది. దీక్షకు హాజరైన ప్రజలు కనిపించకుండా మీడియా అంతా షర్మిల ముందు వాలిపోయారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేసి.. మీడియా చానెల్ ప్రతినిధులు, కెమెరాలు అంటే అటు ఇటు వైపు ఉండాలని.. మధ్యలో ప్రజలకోసం వదిలేయాలని సూచించారు.

ఇంతలోనే ‘మేడం మే సాక్షి చానెల్ ’ వాళ్లం అని ఉత్సాహవంతుడైన సదురు చానెల్ జర్నలిస్ట్ మధ్యలో అడ్డంగా నిలబడి షర్మిలతో అన్నాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన షర్మిల.. నిండు సభలో సాక్షి జర్నలిస్టును కడిగేయడం విశేషం. ‘ ‘కవర్ చేసింది చాల్లేమా.. ఎలాగూ సాక్షి మాకు కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేసింది.

దీంతో అన్నయ్య జగన్ సొంత చానెల్ తన చెల్లెలు రాజకీయ భవిష్యత్ కు అండగా నిలబడడం లేదని.. జగన్  కూడా వ్యతిరేకంగానే ఉన్నారని నిండు సభ సాక్షిగా బయటపడినట్టైంది. ఫస్ట్రేషన్ లో షర్మిల ఇలా అనగానే పక్కనే ఉన్న విజయమ్మ చేత్తో షర్మిలను ఒక్కటి చరిచి ‘ఊకో.. ఊకో’ అంటూ సర్ధి చెప్పడం విశేషం. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్నా చెల్లెలు అనుబంధాన్ని కళ్లకు కట్టింది. వారి మధ్య బంధం బీటలు వారిందని.. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల దారులు వేరనే విషయం మరోసారి మీడియా సాక్షిగా బయటపడినట్టైంది.

https://www.youtube.com/watch?v=kE2jxdVegpY