https://oktelugu.com/

AP Employees: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చరా?

AP Employees: పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది. ఉద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఫలితంగా వారు పోరాటం చేసేందుకే నిర్ణయించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అధికారంలోకి రాకముందే జగన్ పాదయాత్రలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామని ,చెప్పారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. సీపీఎస్ రద్దుతో కష్టాలు ఉంటాయని భావించి దాని స్థానంలో జీపీఎస్ తెస్తామని చెబుతోంది. దీనికి ఉద్యోగులు ససేమిరా […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 4, 2022 / 06:37 PM IST
    Follow us on

    AP Employees: పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది. ఉద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఫలితంగా వారు పోరాటం చేసేందుకే నిర్ణయించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అధికారంలోకి రాకముందే జగన్ పాదయాత్రలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామని ,చెప్పారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. సీపీఎస్ రద్దుతో కష్టాలు ఉంటాయని భావించి దాని స్థానంలో జీపీఎస్ తెస్తామని చెబుతోంది. దీనికి ఉద్యోగులు ససేమిరా అంటున్నారు.

    AP Employees

    ఉద్యోగ సంఘాల నేతలతో 17 అంశాలపై ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా వాటిని సైతం నెరవేర్చడం లేదు. ఫలితంగా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పే రివిజన్ కమిషన్ ను కేంద్రం అమలు చేస్తున్న విధంగా పదేళ్లకు మార్చడానికి ఓకే చెప్పినా తర్వాత ఐదేళ్లకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఆ దిశగాచర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో జీవో ఇంతవరకు బయటకు రాలేదు. దీనిపై ఉద్యోగులకు ఆగ్రహం వస్తోంది. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు.

    Also Read: Group Exams In Urdu: ఉర్దూలో గ్రూప్ పరీక్షలా? జాబ్స్ అన్నీ వాళ్లకేనా!

    ఉద్యోగులు అడిగినవి ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉద్యోగులు ఆందోళన చేసినప్పుడు ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుని వారి సమస్యలు తీర్చడం లేదు. దీంతో వారు చేసేది లేక ప్రభుత్వంపై మండిపడుతున్నా మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఏదో అడిగితే వీరు ఏదో చెబుతూ కాలయాపన చేస్తున్నారు.ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని ప్రశ్నించినా సమాధానం మాత్రం లేదు.

    AP Employees

    సీపీఎస్ రద్దుపై కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో సీపీఎస్ రద్దు ఒకటి కావడం విశేషం. సీపీఎస్ రద్దుతో ప్రభుత్వ ఖజానా గతి తప్పే అవకాశముందని తెలియడంతో సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోతోంది. కానీ ఉద్యోగులు మాత్రం వినిపించుకోవడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై ఇంకా ఎంత రాద్ధాంతం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

    Also Read:TV9 Anchor Devi Nagavalli: టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా?

    Tags