
తెలంగాణ రాజకీయాల్లో కలకలం కలిగించిన అంశం వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన. రాజన్య రాజ్యమంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న షర్మిల త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముద్దుల తనయ వైఎస్ షర్మిల నిర్వహించిన ఆత్మీయ సమావేశం తెలంగాణ రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ , బీజేపీలు విమర్శలు గుప్పించాయి.
Also Read: వర్షాలపై నా మాటలు వక్రీకరించారు: మేయర్ విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణలో రాజన్య రాజ్యం తెస్తానంటూ చెప్పడమే కాకుండా త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇంకా పార్టీ పేరు, ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే కొత్త పార్టీ విషయమై ఏర్పాట్లు ఊపందుకున్నట్టు సమాచారం.
Also Read: రేవంత్ రెడ్డి పాదయాత్ర సీనియర్లకు నచ్చడం లేదా..? అందుకే అలా చేశారా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై రెండు తేదీలు వినిపిస్తున్నాయి. ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అయిన జూలై 8వ తేదీ కాగా.. మరొకటి వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 14. వైఎస్ షర్మిల జూలై 8వ తేదీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. జూలై అంటే మరింత ఆలస్యమై.. పార్టీ బలోపేతానికి సమస్య రావచ్చని మే 14వ తేదీ అయితే అన్నివిధాలా బాగుంటుందనేది కొంతమంది సూచన. మే 14న పార్టీ ప్రకటిస్తే వెనువెంటనే పాదయాత్ర కూడా ప్రారంభించవచ్చనేది ఆలోచనగా ఉంది. రెండింట్లో ఏ తేదీ అనేది త్వరలోనే నిర్ణయించనున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
పార్టీ నిర్మాణంపై ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చర్చోపచర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. కీలక నేతలతో ఆమె చర్చిస్తున్నారు. తనపై మిగతా పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లకు.. ఘాటుగా సమాధానం ఇచ్చేలా షర్మిల కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్లకే హక్కు ఉందంటూ అధికార పార్టీ నేతలు చేసిన కామెంట్లను ఆమె గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారట. తాను తెలంగాణ కోడలినని.. తనకు హక్కు ఉందని అనుచరుల దగ్గర షర్మిల వ్యాఖ్యానించారని సమాచారం. పుట్టినిల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణ అని షర్మిల ప్రచారం చేసే ఛాన్స్ ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Comments are closed.