YS Sharmila: జగన్ స్టైల్ లో నే షర్మిల..తొలి అభ్యర్థి ఇతడే

YS Sharmila: రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్న షర్మిల వైఎస్సార్ టీపీ స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని భావించారు. దీనికి తోడు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల సాధనకు నిరాహార దీక్షలు సైతం చేపట్టి వారిలో ధైర్యం నింపాలని చూస్తున్నారు. దీనికి గాను రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరుద్యోగుల సమస్యల సాధనకు భరోసా ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పర్యటిస్తూ తన పార్టీని విస్తృతం చేసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ కూర్పులో వైసీపీకి పోలికలు ఉన్నాయి. రంగు, పేరు విషయంలో […]

Written By: Srinivas, Updated On : September 13, 2021 5:15 pm
Follow us on

YS Sharmila: రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్న షర్మిల వైఎస్సార్ టీపీ స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని భావించారు. దీనికి తోడు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల సాధనకు నిరాహార దీక్షలు సైతం చేపట్టి వారిలో ధైర్యం నింపాలని చూస్తున్నారు. దీనికి గాను రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరుద్యోగుల సమస్యల సాధనకు భరోసా ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పర్యటిస్తూ తన పార్టీని విస్తృతం చేసుకోవాలని భావిస్తున్నారు.

పార్టీ కూర్పులో వైసీపీకి పోలికలు ఉన్నాయి. రంగు, పేరు విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నా రెండు పార్టీల ఉద్దేశాలు కూడా ఒకటే. రాజన్న రాజ్యం తేవాలని ఇద్దరు అన్నా చెల్లెలు కలలు కంటున్నారు. ఓ వైపు ఏపీలో అన్న అధికారంలో ఉండగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల చూస్తున్నారు. కానీ పార్టీ ప్రతిష్ట మాత్రం మొదట్లో కాస్త మెరుగ్గా కనిపించినా తరువాత మసకబారినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు.

పార్టీ సభ్యత్వానికి ఇందిరా శోభన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నేతలను కాపాడుకోవాలని షర్మిల భావిస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్లిపోకూడదని సూచించేలా సంకేతాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజా గాయకుడు ఏవూరి సోమన్న కూడా పార్టీని వీడుతారని ప్రచారం చోటుచేసుకోవడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కళాకారుడుగా ఉన్న సోమన్నను తుంగతుర్తి తొలి వైఎస్సార్ టీపీ అభ్యర్థిగా ప్రకటించారు.

షర్మిల పార్టీని బలహీన పర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇతర పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల్ని ఆకర్షిస్తే మొదటికే మోసం వస్తుందని అనుమానం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో షర్మిల పార్టీని ప్రక్షాళన చేసి బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల వరకు షర్మిల పార్టీ ప్రతిష్ట పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.