
YS Sharmila- Hijras: హిజ్రాల దెబ్బకు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బిడ్డ దిగిరాక తప్పలేదు. మహిళను కాబట్టి ఏం మాట్లాడుతున్నా చెల్లుతుంది అనుకున్న షర్మిలకు ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ చుక్కలు చూసెడుతోంది. దీనికితోడు తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమను షర్మిల కించపర్చారంటూ రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలు ఆందోళన చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. తమకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.
క్షమించండి.. మీరంంతా నా అక్కచెల్లెళ్లు..
హిజ్రాల ఆందోళనతో షర్మిల దిగివచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త పవన్‌పై టీఆర్‌ఎస్ నాయకులు ఇటీవల దాడిచేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను పరామర్శించేందకు బుధవారం వరంగల్‌కు వచ్చిన షర్మిల ఈ సందర్భంగా హిజ్రాలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘మీరంతా నా అక్కచెల్లెళ్లు.. నా మాటలు మీకు బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నా’ అని ప్రకటించారు.

మూడు రోజుల ఆందోళనతో..
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను విమర్శించే క్రమంలో హిజ్రాలను ఉదాహరణగా చూపిస్తే షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. పాదయాత్రకు అనుమతులు రద్దు చేసి హైదరాబాద్‌లో విడిచి పెట్టారు. ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటంతో హిజ్రాలు షర్మిల తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తక్షణం తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా ప్రకటించారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కొజ్జా.. కొజ్జా అంటూ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదని హిజ్రాలు హెచ్చరించారు. ఈ నిరసనలు అంతకంతకూ పెరుగుతూండడటంతో షర్మిల భేషరతుల క్షమాపణలు చెప్పారు. అంతేకాదు వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు.. వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. మరి షర్మిల క్షమాపణతో హిజ్రాలు సంతృప్తి చెందుతారో లేదో వేచిచూడాలి.
