Homeఎంటర్టైన్మెంట్Dead Hero, Heroines: కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..

Dead Hero, Heroines: కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..

Dead Hero, Heroines: సినీ తారల ప్రపంచం సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అయితే, చాలా మంది వారికి లగ్జరియస్ లైఫ్ ఉంటుందని అనుకుంటారు. అది నిజమే. కానీ, వారికి కూడా కష్టాలు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడిగలిగిన వాళ్లే ఇండస్ట్రీలో మనగలుగుతారు. లేదంటే మధ్యలోనే ఇతర సమస్యల బారిన పడొచ్చు. చివరికి వారు తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకునే అవకాశాలుంటాయి. అలా టాలీవుడ్ పరిశ్రమలో స్ట్రెస్ తట్టుకోలేక, అనారోగ్య సమస్యలతో, యాక్సిడెంట్స్ వలన కొంత మంది నటీనటుడు చనిపోయారు. వారు ఎవరో తెలుసుకుందాం.

Dead Hero, Heroines
Dead Hero, Heroines

బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. తెలుగులో చేసిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. విక్టరీ వెంకటేశ్‌కు జతగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తరుణ్‌తో నటించిన ‘నువ్వులేక నేను లేను’ ఫిల్మ్‌లోని కృష్ణవేణి రోల్‌కు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంగతులు అలా ఉంచితే..ఈ భామ తన బరువు తగ్గించుకునేందుకుగాను లైపో సక్సన్ చేయించుకుంది. దాని ప్రభావం వలన హార్ట్ ఫెయిల్యూర్‌తో 2015లో మరణించింది.

మరో బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య.. గురించి అందరికీ తెలుసు. తెలుగు ఇంటి అమ్మాయిగా మారిపోయిన ఈ సినీ తార ప్రైవేటు విమానంలో చనిపోయింది. కరీంనగర్‌కు వెళ్లేందుకు బయలుదేరిన విమానం మధ్యలోనే కూలిపోయి 2004లో సౌందర్య మరణించింది. లవర్ బాయ్ ఇమేజ్ పొందిన సక్సెస్ ఫుల్ హీరో ఉదయ్ కిరణ్.. అవకాశాలు రావడం లేదని డిప్రె షన్‌తో సూ*^*^% చేసుకుని చనిపోయాడు. ప్రత్యూష కూడా తన సినీ కెరీర్‌లో అత్యద్భుతమైన పాత్రలు పోషించింది. కానీ, అర్ధాంతరంగానే చనిపోయింది. 2002లో సూసైడ్ చేసుకుని మరణించింది.

Also Read: కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి.. ఆశిస్తున్నదేంటి?

నటుడు శ్రీహరి అనారోగ్య సమస్యలతో 2013లో చనిపోయాడు. కమెడియన్ వేణుమాధవ్ కూడా అనారోగ్యంతో మరణించాడు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి.. 2014లో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. యశో సాగర్, భరత్ కూడా అర్ధాంతరంగానే వాళ్ల జీవితం ముగించేశారు.

Also Read: సినీతారల సంక్రాంతి అప్డేట్స్ మీకోసం..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular