దశలవారీగా మద్యం నిషేధం అమలు పరుస్తామని అధికారంలోకి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యం షాపులను తెరవడమే కాకుండా, ధరలు 75 శాతం పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు తెలుస్తున్నది.
జగన్ కు సన్నిహితుడైన ఒక సలహాదారుడి బినామీ మద్యం బ్రాండ్ లను మాత్రమే అమ్ముతు, అతనికి భారీ లాభాలు కలుగుచేస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. నాసిరకం మద్యాన్ని అత్యధిక ధరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు.
అల్లుడి అరాచకాలపై కొరడా ఝుళిపించండి..!
‘‘మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలో భారీ కుంభకోణం నడుస్తోంది. నాసిరకం మద్యాన్ని పిచ్చి బ్రాండ్ల పేరుతో ప్రజలకు అంటగట్టి బడాబాబులు జేబులు నింపుకొంటున్నారు. వారిచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు కళ్లకు గంతలు కట్టుకొన్నారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం తయారుచేసే డిస్టిలరీలన్నింటినీ ముఖ్యమంత్రి, ఆయన చుట్టూ ఉన్నవారు స్వాధీనం చేసుకొన్నారు. వాటిలో మెజారిటీ వాటాను బలవంతంగా తీసుకొన్నారు. వాటిలో ఏనాడూ కనీవినీ ఎరుగని… ఊరుపేరు లేని బ్రాండ్ల పేరుతో మద్యం తయారు చేసి ప్రజలకు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.
జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?
కేవలం రూ.10కి తయారయ్యే మద్యాన్ని ప్రజలకు రూ.150కీ, రూ.15-16కు తయారయ్యే మద్యాన్ని రూ.200-రూ.250కి అమ్ముతున్నారు. ప్రభుత్వ షాపుల్లో అమ్మే ఈ మద్యాన్ని ఎవరైనా వరుసగా వారంపాటు తాగితే పక్షవాతం రావడం ఖాయం అని సోమిరెడ్డి స్పష్టం చేశారు..
కాగా, పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో లభించే పేరున్న బ్రాండ్ లు ఏపీలో ఎందుకు కనిపించడం లేదు, నాసిరకం బ్రాండ్ లను కొత్తగా ఎందుకు తీసుకు వస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలా ఉండగా, జే ట్యాక్స్ కోసమే మద్యం షాపులు తెరిచారని టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. కరోనా కేసులు పెరుగుతుంటే అనాలోచితంగా మద్యం షాపులు తెరిచారని మండిపడ్డారు. కేంద్రం మద్యం ధరలు 75శాతం పెంచాలని చెప్పిందా? అని రాజా ప్రశ్నించారు.