Homeజాతీయ వార్తలుRahul Gandhi Marriage: రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామా.. సోనియా స్పందన ఏంటో తెలుసా?

Rahul Gandhi Marriage: రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామా.. సోనియా స్పందన ఏంటో తెలుసా?

Rahul Gandhi Marriage: ” వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ ఆయన మాత్రం ఒక ఇంటి వాడు కాలేకపోతున్నాడు” రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన చర్చ ఇది.. ఇటీవల బెంగళూరులో ప్రతిపక్షాలు సమావేశమైనప్పుడు లంచ్ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ గాంధీని పెళ్లి చేసుకో అని సూచించాడు. ఈ విషయాన్ని సోనియాగాంధీతో చర్చిస్తానని అని కూడా అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే బరాత్ లో డ్యాన్స్ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ జరిగి రోజులు గడిచిపోతున్నాయి. కానీ రాహుల్ గాంధీ పెళ్లి విషయంలో మాత్రం అడుగు కూడా ముందుకు పడటం లేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి మళ్లీ చర్చ మొదలైంది. కానీ ఈసారి రాహుల్ గాంధీని పెళ్లి తీసుకోమని చెప్పింది ఏ రాజకీయ నాయకులో, కాంగ్రెస్ నాయకులో కాదు..

ఆ మధ్య హర్యానా రాష్ట్రం లో సోనియా గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా సోనే పాట్ జిల్లాలోని మదీనా గ్రామానికి చెందిన మహిళలు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెతో మాట్లాడారు. అనేక చర్చల తర్వాత ఒకసారి ఢిల్లీలోని తన నివాసానికి రావాలని సోనియాగాంధీ వారిని కోరారు. అయితే ఇటీవల ఆ గ్రామానికి చెందిన మహిళలు ఢిల్లీ వెళ్లారు. సోనియాగాంధీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఢిల్లీలోని పలు ప్రాంతాలను సోనియా గాంధీ సూచన మేరకు ఆమె వ్యక్తిగత సిబ్బంది చూపించారు. అనంతరం వారు సోనియాగాంధీ నివాసంలో భోజనం చేశారు. ఈ విందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా. ఈ సందర్భంగా సోనియాగాంధీ చెవిలో రాహుల్ గాంధీకి పెళ్లి చేయవచ్చు కదా అని మహిళలు గుసగుసలాడారు. మీరే మంచి పిల్లను చూడాలని సోనియాగాంధీ వారికి బదులిచ్చారు. ఈ సంభాషణ మొత్తం విన్న రాహుల్ గాంధీ “అవుతుంది అవుతుంది” బదులిచ్చారు. దీంతో సోనియాగాంధీ ముసి ముసి నవ్వులు నవ్వారు.

భోజనం అనంతరం ఆ మహిళలతో సోనియాగాంధీ నృత్యం చేశారు. వారితో కలివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ మరణం ప్రస్తావనకు వచ్చినప్పుడు సోనియాగాంధీ ఉద్వేగానికి గురయ్యారు.”నాన్న చనిపోయినప్పుడు అమ్మ కొద్ది రోజుల దాకా అన్నం, మంచినీళ్లు ముట్టలేదని” ప్రియాంక గాంధీ వారికి బదులిచ్చారు.. అనంతరం కొద్దిసేపు అయిన తర్వాత సోనియాగాంధీ తేరుకొని వారితో మాట్లాడారు. సాగులో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు, వ్యవసాయం ఏ స్థాయిలో గిట్టుబాటు అవుతున్నది? ఉపాధి పథకం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తోంది? వంటి విషయాలను సోనియాగాంధీ తెలుసుకున్నారు. కాగా హర్యానా మహిళా రైతుల పర్యటన విశేషాలకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూ ట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా రాహుల్ గాంధీని త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుతుండడం విశేషం.

 

मां के घर पर कुछ ख़ास मेहमान | भारत जोड़ते किसान - Part 2 | Haryana Farmers | Rahul Gandhi

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version