Yogi Adityanath: దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జరగుతోంది. ఓటరు జాబితాను శుద్ధి చేస్తున్నారు. ఇందులో నకిలీ ఓట్లు, రెండు మూడు ఓట్లు ఉన్నవారిని తొలగిస్తున్నారు. సరైన పత్రాలు లేనివారిని, నకిలీ పత్రాలతో ఓటుహక్కు పొందినవారిని తొలగిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా వచ్చి గోరఖ్‌పూర్ నుంచి గౌతమ బుద్ధనగర్ వరకు లఖీన్‌పూరిఖేరీ, బెహ్రాయిచ్, ఫిల్‌బిత్ జిల్లాల్లో నేపాలీలు ఎక్కువ. సరిహద్దు జిల్లాల్లో మదరసాలు ఉన్నాయి. ముస్లింలు కూడా అక్రమంగా ఉంటున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి పారిపోయిన బంగ్లాదేశీయులు ఉత్తరప్రదేశ్‌కు వస్తున్నారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు.
డిటెన్షన్ సెంటర్ల ఏర్పాటు..
పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి డిటెన్షన్ సెంటర్లలో పెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ డిటెన్షన్ సెంటర్లు అసోంలో ఉన్నాయి. ఇప్పుడు యూపీలో కూడా ఏర్పాటు చేశారు. డిటెన్షన్ సెంటర్లలో అక్రమంగా వచ్చినవారిని ఉంచి.. వారి ఇంతకాలం ఎలా ఉన్నారు. ఏం చేశారు. నకిలీ పత్రాలు ఎలా పొందారు.. తదితర వివరాలు సేకరించి తప్పు చేస్తే శిక్ష విధిస్తారు. తర్వాత వారిని స్వదేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు యోగి నవంబర్ 22న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
పాస్‌పోర్టు గడువు ముగిసినా..
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామిలి, నోయిడా, సుల్తాన్‌పూర్, అలీఘడ్ ప్రాంతాల్లో నేపాల్, బంగ్లాదేశ్ మూలాలు ఉన్నవారు ఎక్కువగా ఉన్నవారు. పాకిస్తానీలు కూడా ఎక్కువగా ఉన్నారు. పాస్‌పోర్టు గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ముస్లిం లీగ్ రాజకీయాలకు కేంద్ర బిందువు. వలసవాదులను ఇంతకాలం ఏమీ అనలేదు. ఇప్పుడు ఎస్‌ఐఆర్‌తో ఏరివేస్తున్నారు.
కొందరు అక్రమంగా పత్రాలు పొందినవారు ఉన్నారు.
12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్..
బిహార్‌లో ఎస్‌ఐఆర్ విజయవంతమైంది. దీంతో 2026, 2027లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇప్పుడు ఎస్‌ఐఆర్ అమలు చేస్తున్నారు. నవంబర్ 4న ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 4 వరకు పూర్తి చేయనున్నారు. చనిపోయినవారిని తొలగిండం, వలస వెళ్లినవారి పేర్లు తొలగిండం, రెండు మూడు ఓట్లు ఉన్నవారిని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్ష్యద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్ జరుగుతోంది.
రెండు రాష్ట్రాల్లోనే అభ్యంతరాలు..
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పశ్చిమబెంగాల్, కేరళ వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దీనిపై పెద్ద పోరాటమే చేస్తున్నారు. కానీ ఏవీ ఫలించడం లేదు. కోర్టును ఆశ్రయించినా ఉపశమనం దక్కలేదు. దీంతో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను గుర్తించి ఏరివేస్తున్నారు. కొందరు పారిపోతున్నారు. ఇక కేరళ కూడా ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కూడా నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది.