Madvi Hidma Funeral: నవంబర్ 23, ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనలో హటాత్తుగా నినాదాలు మారిపోయాయి. ప్లకార్డులు మారిపోయాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడా ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో అతని అనుకూల నినాదాలు హోరెత్తాయి. ఇంటింటా హిడ్మా పుడతాడని హెచ్చరించారు నిరసనకారులు. అర్బన్ నక్సల్ గ్యాంగ్ ఈ పనిచేసింది.
పువర్తిలో అంత్యక్రియలు..
మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా, ఆయన భార్య ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఆయన స్వగ్రామం పువర్తిలో హిడ్మా అంత్యక్రియలు నిర్వహించారు. సాధారణంగా మావోయిస్టుల అంత్యక్రియల్లో కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు, ప్రజాగాయకులు కనిపిస్తారు. కానీ హిడ్మా అంత్యక్రియల్లో వీరెవరూ కనిపించలేదు. ఎర్రజెండాలు పట్టుకుని నృత్యలు చేసేవారు కానరాలేదు. అక్కడ కేవలం గిరిజనులు తమ సంస్కృతి ప్రకారం ఏడుస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు.
గిరిజనుడు అనేనా..
కమ్యూనిస్టు సానుభూతిపరులు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అక్కడ వారికి ఎలాంటి సౌకర్యాలు లేవు. అందుకే అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. గిరిజనుడు హిడ్మా కావడంతో గిరిజనుడి ప్రాణానికి పెద్దగా విలువ లేదు. అందుకే ఎవరూ వెళ్లలేదు. కానీ, ఢిల్లీలో హిడ్మా పేరుతో నిరసన తెలిపారు. అర్బన్ నక్సల్స్ ఈ పని చేశారు. పర్యావరణం పేరుతో నినాదాలు ఇస్తున్నారు. పది పన్నెండేళ్ల క్రితం అఫ్జల్ గురు చనిపోయిన రోజు భారత్‌లోని యూనివర్సిటీల్లో ఆందోళన చేశారు. హిడ్మా హత్య తర్వాత కూడా ఇలానే చేద్ధామని ఢిల్లీలో నిరసన తెలిపారు.