Yogendra Singh Yadav: అదిగో అప్పుడే అతడు సింహం లాగా గర్జన చేశాడు. శరీరం నుంచి రక్తం కారిపోతున్నప్పటికీ.. చావు అనేది చివరి అంచుదాక వచ్చినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా.. తన చేతికి పని చెప్పాడు. బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు లెక్కకు మిక్కిలి పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి అవతల పడేశాడు. ఆ తర్వాత అతడు నేలకొరిగాడు. అతడు చేసిన ఆ వీరోచిత పోరాటం తోటి సైనికులకు స్ఫూర్తి పాఠం లాగా నిలిచింది. సోల్జర్ అంటే ఉద్యోగం కాదని.. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే త్యాగం అని నిరూపించింది. ఆ తర్వాత అతడు భారత సైనిక చరిత్రలో ఒక భాగమయ్యాడు. శిక్షణలో ఉండే సోల్జర్లకు ఒక పాఠమయ్యాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరమవీరచక్ర బిరుదాంకితుడయ్యాడు . అందుకే ఇప్పటికి అతడిని సైన్యంలో లయన్ అని కీర్తిస్తుంటారు. ఒకవేళ అతడు గనుక బతికి ఉంటే.. పాకిస్తాన్ దేశాన్ని తగలబెట్టి ఉండేవాడని.. ఉగ్రవాదులను మొత్తం సర్వనాశనం చేసి ఉండేవాడని తోటి సైనికులు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తుంటారు.
Also Read: ఆపరేషన్ సిందూర్.. భారత రక్షణ వైఖరిలో మార్పు
ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో.. భారత సైనికుడు యోగేందర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.. ఎందుకంటే యోగేందర్ ఆర్మీలో కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చేరలేదు. దేశ భద్రత కోసం.. దేశమంటే ప్రేమతో ఆర్మీలో చేరాడు. చివరివరకు అతడు దేశ క్షేమం కోసమే పనిచేశాడు. తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయలేదు. బార్డర్లో ఉగ్రవాద దేశానికి చెందిన టెర్రరిస్టులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపి.. బార్డర్లో రక్తపాతం సృష్టిస్తుంటే.. యోగేందర్ ఏమాత్రం భయపడకుండా పోరాటం చేశాడు.. ఉగ్రవాదులను ఎక్కడికక్కడ కాల్చి పడేశాడు. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అతని గురించి హైదరాబాద్ కు చెందిన మేజర్ ఎస్ పీ ఎస్ ఒబెరాయ్ ఇటీవల నిర్వహించిన యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ” తన మాతృభూమి ప్రమాదంలో ఉందని తెలిస్తే ఏ సోల్జర్ అయినా సరే సింహం లాగా గర్జిస్తాడు. దానికి బలమైన ఉదాహరణ 19 సంవత్సరాల యోగేందర్. బార్డర్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల లో అతడు వీరోచిత పోరాటం చేశాడు. అతడు ఒక్కడే కార్గిల్ వద్ద బంకర్లలో దాక్కున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశాడు. అప్పటికి అతడు శరీరంలో 16 బుల్లెట్స్ ఉన్నాయి. చావు చివరి అంచుదాక ఉన్నాడు. అయినా సరే దేశం కోసం ప్రాణాలు విడిచాడు. అతడికి ప్రభుత్వం పరమవీరచక్ర పురస్కారం అందించిందని” ఒబెరాయ్ పేర్కొన్నారు. ఒబెరాయ్ యోగేందర్ గురించి చెబుతున్నప్పుడు రోమాలు నిక్కబొడిచాయి.
Also Read: భారత్ పై సైబర్ దాడి.. హై అలెర్ట్