తాజాగా ‘యస్ బ్యాంక్’పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకు లావాదేవీలు పరిమితంగా జరుగుతున్నాయి. ఈ ప్రభావం ‘ఫోన్‌పే’పై పడింది. ఎందుకంటే ‘ఫోన్‌పే’కు అతిపెద్ద పేమెంట్ భాగస్వామిగా ‘యస్ బ్యాంక్’ కొనసాగుతోంది.గత రెండురోజులుగా ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్ బ్యాంక్ నోడల్ అకౌంట్స్ పని చేయకపోవడంతో లావాదేవీలు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో యస్ బ్యాంక్ ఖాతాదారులతోపాటు ‘ఫోన్‌పే’ యూజర్లు లావాదేవీలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై స్పందించిన ‘ఫోన్‌పే’ యూజర్లకు క్షమాపణలను చెప్పింది. తమ సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యస్ బ్యాంక్ పై ఆర్బీఐ మాటిరిటోరియం విధించడం వల్ల బ్యాంక్ షేర్లు ఇప్పటికే 85శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యస్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.