Pawan Kalyan- YCP: వైసీపీపై ఒంటికాలిపై లేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను సినిమా వాళ్లతోనే కొట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. అందుకే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిలిపించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ప్లాన్ చేసినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. జగన్ ను వర్మ కలవడం వెనుక ఆంతర్యం ఇదే అంటున్నారు.

ఇప్పుడు జగన్ ని వర్మ నేరుగా కలిసి అరగంటకు పైగా చర్చలు నడిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో చిత్ర పరిశ్రమకు ఎలాంటి సమస్యలు లేవు. మరి ఏ విషయం మాట్లాడటానికి వర్మ సీఎం జగన్ ని కలిశాడన్న సందేహాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఒక వాదన తెరపైకి వచ్చింది. జగన్ రాజకీయ అజెండాలో భాగంగా పవన్ కళ్యాణ్ ని దెబ్బతీయడం కోసమే ఈ భేటీ అంటున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. చాలా కాలంగా తన పెళ్లిళ్లపై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలకు పవన్ ధీటైన సమాధానం ఇచ్చారు. భార్యాభర్తలకు గిట్టనప్పుడు చట్టపరంగా విడిపోతే తప్పేంటని ప్రశ్నించారు. విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలకు భరణంగా చెల్లించిన మొత్తాన్ని పవన్ బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ విషయం మాట్లాడేప్పుడు పరుషపదజాలం వాడారు. పేరుకు ఒక భార్యే కానీ ఒక్కొక్కడికి 30 స్టెప్నీలు అంటూ ధ్వజమెత్తారు. పవన్ ప్రసంగం రాజకీయవర్గాల్లో హీట్ పుట్టించింది. వైసీపీకి బలంగా తగిలింది.

పవన్ మూడు పెళ్లిపై అంత వివరణ ఇచ్చినా ఈ ఆరోపణలు ఆగే సూచనలు లేవంటున్నారు. పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు పెద్ద ప్రణాళికలే రచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ వివాహాలపై ఏకంగా సినిమాలు చేసేందుకు పావులు కదుపుతున్నారట. దీనిలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ ని కలిశారనేది హాట్ న్యూస్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వెండితెరపై తప్పుగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలపై మూడు సినిమాలు రానున్నాయి అంటున్నారు. ఈ మేరకు ఒక వైసీపీ ఎంపీ ఈ సినిమాకు భారీ పెట్టుబడి పెట్టడానికి ఓకే అన్నాడట.. జగన్ ప్రోద్బలంతోనే ఆ వైసీపీ ఎంపీ ఈ మూవీ నిర్మిస్తున్నాడని..ఎన్ని కోట్లు ఖర్చయినా కూడా పెట్టి పవన్ పరువు తీసే సినిమా తీయాలని ఈ భేటిలో నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆ ఎంపీ భారీ ఆస్తిపరుడు కూడా. ఈ క్రమంలోనే వర్మతో సినిమా నిర్మాణ బాధ్యతలను ఆ ఎంపీకే అప్పగించాడట..
గతంలో కూడా పవన్ వ్యక్తిత్వాన్ని కించ పరిచే చిత్రాలు చేసిన వర్మను జగన్ ఈ సినిమాలకు ఎంచుకున్నారు అంటున్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుందట. 2024 ఎన్నికలకు ముందు థియేటర్స్ లోకి ఈ సినిమాలు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట..