
Home Minister Taneti Vanitha: అనువుగాని చోట అధికులమనరాదు.. ఈ పద్యం చదవనట్టున్నారు. ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత అర్ధం పర్థం లేని మాటలతో అడ్డంగా బుక్కవుతున్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనలు జరిగినప్పుడు బాధితుల పరామర్శలు, మీడియా ముందు వివరణ ఇచ్చే సమయంలో కనీస కసరత్తు చేయకుండా, అవగాన లేకుండా మాట్లాడుతున్నారు. ఏరికోరి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. తాజాగా తాడేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనపై కూడా అలానే మాట్లాడేశారు. పోలీసు శాఖను వెనుకేసుకొచ్చే క్రమంలో పోలీసుల సమర్ధతపై అనుమానపు వ్యాఖ్యలు చేశారు. నిందితుడ్ని సమర్థించేలా ఆమె ప్రకటనలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Ex-Telangana CS Somesh Kumar: వీఆర్ఎస్ తో మళ్లీ కేసీఆర్ ఆస్థానంలోకి ‘సోమేష్’
అసలే రాష్ట్రంలో మంత్రులకు తమ సొంత శాఖల పై పట్టులేదన్న విమర్శలున్నాయి. కేవలం నవరత్నాల్లో పాలన సాగిస్తుంటే శాఖల పనితీరుకు అవకాశం ఎక్కడ? అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. పైగా వనిత నిర్వహిస్తున్నది హోంశాఖ. పేరుకే ఆమె మంత్రి కానీ.. రివ్యూలు, నిర్ణయాలన్నీ సీఎం జగనే తీసుకుంటారు. ఆయనకు వీలుకానప్పుడు సజ్జలకు అప్పగిస్తారు. మొన్నటి వరకూ హోంశాఖను నిర్వర్తించిన మేకతోటి సుచరిత వ్యక్తం చేసిన బాధ ఇదే. కనీసం కానిస్టేబుల్ ను బదిలీ చేసే అధికారం కూడా లేకుండా పోయిందని ఆమె తరచూ బాధపడుతుంటారుట. అయితే ఆమె నుంచి పదవిని తీసుకొని వనితకు అప్పగించారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే ఉంది. ఎంత గమ్మున ఉంటే అంత సవ్యంగా పదవిని అనుభవించవచ్చు. కానీ తనకు అన్నీ తెలుసునన్న క్రమంలో మాట్లడుతున్న వనిత మాత్రం అడ్డంగా బుక్కవుతున్నారు.
మొన్న ఆ మధ్యన సీతానగరం అత్యాచార ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ లో విలేఖర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. నిందితుడ్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించేసరికి కంగారు పడి సమాధానమిచ్చారు. నిందితుడు తరచూ సిమ్ లు మారుస్తున్నాడని.. ఇప్పటివరకూ 100 సిమ్ లు మార్చాడంటూ సంబంధం లేకుండా మాట్లాడారు. పోలీస్ విచారణ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో పోలీసుల సమర్థతను ప్రశ్నించేలా హోం మంత్రి మాట్లాడేసరికి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు తాడేపల్లి బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు గంజాయి, మత్తు పదార్థాలు తీసుకోలేదని వకాల్తాతో మాట్లాడేశారు. పోలీస్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని.. గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా ఉందని పోలీస్ శాఖ తరుపున చెప్పే క్రమంలో అలా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనకు వ్యక్తిగత కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. నిందితుడి మీద తేలిక సెక్షన్లతో కేసులు నమోదు అయ్యే వీలుకల్పించేలా ఆమె వివరణ ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి. కనీస కసరత్తు లేకుండా, కేసుపై అవగాహన తెచ్చుకోకుండా మీడియా ముందుకు వచ్చి మంత్రి తమ పరువుతీస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Hyper Aadi- Dhanush: హైపర్ ఆది క్రేజ్ చూసి ఆశ్చర్యపోయిన హీరో ధనుష్..వైరల్ అవుతున్న వీడియో