YCP vs Tollywood: గత కొద్ది రోజులు ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ కొనసా..గుతోంది. వైసీపీ నేతలు కొద్ది రోజుల నుంచి సినీ పరిశ్రమపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నిర్మాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. టాలీవుడ్ ఆత్మగౌరవంపైన వైసీపీ సర్కారు దాడి చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రముఖులు సైతం ఇక ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆత్మ గౌరవం మీద దెబ్బ పడితే సహించేది లేదన్న రీతిలో స్పందిస్తున్నారు.

తాజాగా ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ఖండించాడు. రైటర్ వీఎన్ ఆదిత్య తన స్పందనను తన రైటింగ్ లో తెలిపాడు. అలా సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమదైన స్టైల్‌లో ఏపీ సర్కారుపైన దాడి చేస్తున్నారు. తమకు అస్సలు గౌరవమే లేదన్న రీతిలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు.
Also Read: యూపీ : బీజేపీలో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. యోగి అక్కడి నుంచే?
ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు గత కొద్ది రోజుల నుంచి కావాలనే సినీపరిశ్రమను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయానికి పలువురు సినీ ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఊరుకునేది లేదని ఇండస్ట్రీని కాపాడుకునేందుకుగాను అందరూ కలిసి రావాలని అనుకుంటున్నారని టాక్. సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయమై వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఇంకా ఇబ్బందిర పరిస్థతులు ఏర్పడ్డాయి.
సినిమా టికెట్ల ధరల విషయమై తన వాదనను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమరావతికి వెళ్లి మరీ తన వాదనను వినిపించాడు. ఆ తర్వాత కేవలం ఒకే గంటలో 24 ట్వీట్లు చేసి పలు ప్రశ్నలను ప్రభుత్వాని ఎదుట అయితే ఉంచాడు. టికెట్ల ధర సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. కానీ, ఆయన ఆ క్రమంలోనే సినీ వ్యాపారం చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ పెద్దలు ఒక తాటి మీదకు వచ్చి ఏపీ సర్కారు వద్దకు వెళ్లి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారో లేదో చూడాలి..
Also Read: ఏపీ సర్కార్ ‘పీఆర్సీ’ ఫైట్ కు మళ్లీ సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు