
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసే క్రమంలో అక్కడి ఎంపీలు మాట్లాడుకున్న వీడియో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఇదే అదనుగా టీడీపీ తన ప్రభావాన్ని చూపెట్టాలనే ముందు చూపులో భాగంగా వైసీపీ పై విమర్శలు ఎక్కు పెట్టింది. ఏపీకి వైసీపీ వైరస్ పట్టుకుందని ప్రచారం ప్రారంభించింది. ఇదే మా నాయకుడు చంద్రబాబు ఉంటే వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎన్నో పద్ధతుల్లో కరోనా తుదముట్టించే వారని చెబుతున్నారు. దీనికి వైసీపీ నేతలు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. కరోనా కంటే చంద్రబాబు నైజమే ప్రధాన వైరస్ అని విమర్శిస్తున్నారు.
రాజకీయ హైడ్రామా
ప్రస్తుతం ఏపీలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. పార్టీలు టీడీపీ, వైసీపీలు ఒకదానిపై మరొకటి వక్రభాష్యాలు చెబుతున్నాయి. మీరంటే మీరే అవినీతి పరులను దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరు పార్టీల నేతలు క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని భావిస్తూ ఇప్పటి నుంచే పావులు కదువుతున్నారు. ఇందులో భాగంగానే ఈ దుమారం రేగినట్లు భావిస్తున్నారు.
కరోనా వ్యాక్సినే ప్రధాన సమస్య
కరోనా వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ నడుస్తోంది. మా నాయకుడు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పలువురు టీడీపీ నేతలు చెబుతున్నారు. మేము సైతం వ్యాక్సిన్ వేసేందుకు చొరవ తీసుకుంటున్నామని వైసీపీ నేతలు బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు పార్టీల బాహాబాహీకి సిద్ధపడే వరకు వెళ్లిందని సమాచారం. ఏది ఏమైనా వైసీపీ, టీడీపీ తమ ప్రభావాన్ని ప్రయత్నంలో భాగంగా రాజకీయ రగడ రేగినట్లు భావిస్తున్నారు.
పార్టీలపై ప్రభావం
కరోనా వైరస్ ప్రజలపైనే కాకుండా పార్టీలపై కూడా ప్రభావం చూపుతోంది. కరోనా వ్యాక్సినే ప్రధానంగా ఇరు పార్టీల నేతలు తమ గళాలకు పదును పెడుతున్నారు. ఎవరి పరిధి మేరకు వారు తమ ప్రభావాన్ని చూపెట్టాలనే భావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసే క్రమంలో ఎలాంటి సమస్యలుంటాయో తెలియదా అని వైసీపీ నాయకులు అంటుంటే మీరేం చేస్తారు మీకు చేతకాదని టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఏదిఏమైనా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితిపై సగటు ఓటరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.