IPS officer A B Venkateswara Rao: చంద్రబాబు హయాంలో పనిచేసిన చాలామంది ఆఫీసర్లను ఇప్పుడు జగన్ ప్రభుత్వం టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా ఇప్పుడు మరోసారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏబీవీ వెంకటేశ్వరరావు ఈ రోజు సాయంత్రం మీడియా ముందుకు రాబోతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను కొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈయన్ను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది.
ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. దీంతో ఆయనపై ఇప్పుడు జగన్ ప్రభుత్వం చాలా రకాల కేసులు పెట్టింది. ఆయన్నుచాలా సార్లు జాబ్ నుంచి టెర్మినేట్ చేయాలని కూడా చూసిది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన రిటైర్ మెంట్ అయ్యారో లేదో కూడా తెలియని పరిస్థితి.
మొన్నటి వరకు ఆయన, వైసీపీ ప్రభుత్వం కాస్త సైలెంట్ గానే కనిపించాయి. కానీ ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు. తనపై మరోసారి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ఆయన మీడియా ముందుకు రావాలని నిశ్చయించుకున్నారు. ఈ ముసుగులో గుద్దులాట వద్దని, తానే స్వయంగా అన్ని విషయాలను వెల్లడించాలని కోరుకుంటున్నారు.
అయితే ఆయన మీడియా ముందు ఎవరికీ తెలియని విషయాలను కూడా బయట పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి పెగాసస్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సాఫ్ట్ వేర్ కొన్నారో లేదో తెలుసుకోవడం జగన్ ప్రభుత్వానికి నిముషం పని పట్టదు. కానీ కేవలం ఆరోపణలు చేస్తూ హడావిడీ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. మరి ఇప్పుడు ఏబీవీ ఎలాంటి సంచలన విషయాలు బయటపెడుతారో అన్నది మాత్రం వేచి చూడాలి.\
Also Read: BJP Politics: కేసులు, పెగాసస్.. జగన్, చంద్రబాబులను ఏపీ రాజకీయాల నుంచి బీజేపీ సాగనంపబోతోందా?
Recommended Video: