జగన్ బలంపైనే కొడుతున్న వైసీపీ?

బలమైన టీడీపీ పచ్చ మీడియా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వేళ మొన్నటి ఎన్నికల్లో సోషల్ మీడియాతోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా పచ్చ మీడయాతో ఇదే సోషల్ మీడియాతో వైసీపీ యుద్ధం చేస్తోంది. మిగతా అన్ని పోస్టుల్లో సాలరీలు వస్తాయేమో.. కానీ సోషల్ మీడియా వలంటీర్లకు అలాంటివి ఏమీ లేవు. పార్టీ మీద ప్రేమతో నిర్ధాహారాలు మాని నిరంతరం చురుకుగా ఉంటూ సీఎం జగన్ చేసే మంచి తోపాటు చంద్రబాబు […]

Written By: admin, Updated On : June 2, 2020 4:37 pm
Follow us on

బలమైన టీడీపీ పచ్చ మీడియా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వేళ మొన్నటి ఎన్నికల్లో సోషల్ మీడియాతోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా పచ్చ మీడయాతో ఇదే సోషల్ మీడియాతో వైసీపీ యుద్ధం చేస్తోంది.

మిగతా అన్ని పోస్టుల్లో సాలరీలు వస్తాయేమో.. కానీ సోషల్ మీడియా వలంటీర్లకు అలాంటివి ఏమీ లేవు. పార్టీ మీద ప్రేమతో నిర్ధాహారాలు మాని నిరంతరం చురుకుగా ఉంటూ సీఎం జగన్ చేసే మంచి తోపాటు చంద్రబాబు చేసిన తప్పులను ప్రజల వద్దకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా అభిమానుల పాత్ర కాదనలేనది.

మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ అనుకూల మీడియా, పత్రికలు అంతా చేసి జగన్ ను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వేళ ఎంతో మంది వైసీపీ అభిమానులు.. సోషల్ మీడియా యాక్టివిస్టులు.. వైసీపీ అభిమాన గ్రూపులు ఇదే సోషల్ మీడియాలో జగన్ ను ఆకాశానికి ఎత్తుతూ టీడీపీ మీడియా విషప్రచారాన్ని తిప్పికొట్టారు. ప్రజలకు వాస్తవాలను ప్రచారం చేశారు.

అయితే తాజాగా వైసీపీకి బలమైన సోషల్ మీడియాపై అదే వైసీపీ పెద్దలు నోరుపారేసుకోవడం వైసీపీ అభిమానులను హర్ట్ చేస్తోంది. హైకోర్టుపై వ్యాఖ్యలు సోషల్ మీడియా చేస్తే మా మీదకు అది వచ్చిందని. వైసీపీ ప్రభుత్వాన్ని, నేతలను ఇందులోకి లాగారని సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలను చేశారు.. మొన్నటి ఎన్నికల వేళ ఎవరైతే జగన్ కోసం పాటుపడ్డారో ఇప్పుడు వాళ్లనే సజ్జల శత్రువులుగా ట్రీట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వైసీపీకి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియాను పట్టుకొని సజ్జల ఒక చెత్త మురికి గుంటగా అభివర్ణించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో మంది జగన్ అభిమానులు, వలంటీర్లు ఒక రూపాయి కూడా ఆశించకుండా జగన్ పై ఈగవాలకుండా ప్రచారం చేస్తుంటే వారిని పట్టుకొని చెత్త మురికి గుంటగా అభివర్ణించడం ఇప్పుడు దుమారం రేపింది. దీంతో జగన్ కు సపోర్టుగా తాము ఇప్పుడు ఎందుకు పనిచేయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. పార్టీకి సపోర్టుగా నిలవడం తప్పా అని అడుగుతున్నారు..

వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా వారికి మద్దతిచ్చే విశేషమైన సోషల్ మీడియా వింగ్ ను కాపాడుకుంటుందా? లేక కాలదన్నుతుందా? జగన్ కు బలమైన వారిని బలహీనతగా మార్చుకుంటుందా అన్నది వేచిచూడాలి..

-నరేశ్ ఎన్నం