రఘురామ ముక్కు నేలకు రాయాలంటున్న వైసీపీ ఎంపీ..?

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో సమస్యలు ఉంటాయి. అయితే వైసీపీకి మాత్రం ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజే పెద్ద సమస్యగా తయారయ్యారు. అనవసరమైన విషయాలపై కూడా స్పందిస్తూ రఘురామ వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఎంతమంది నచ్చెజెప్పాలని చూస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రఘురామ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు […]

Written By: Navya, Updated On : September 22, 2020 1:55 pm
Follow us on

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో సమస్యలు ఉంటాయి. అయితే వైసీపీకి మాత్రం ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజే పెద్ద సమస్యగా తయారయ్యారు. అనవసరమైన విషయాలపై కూడా స్పందిస్తూ రఘురామ వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఎంతమంది నచ్చెజెప్పాలని చూస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రఘురామ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!

దీంతో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి ధీటుగా జవాబిస్తున్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ దళితులంటే రఘురామకు లెక్కే లేదని.. ఆయన అహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ కమిషన్‌ మెంబర్‌ రాములుకు రఘురామపై ఫిర్యాదు చేశానని… ఆయన తనను సెక్యూరిటీతో కాల్చి చంపిస్తారని వ్యాఖ్యలు చేశారని అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ నందిగం సురేష్ రఘురామపై మండిపడ్దారు.

రఘురామ వైసీపీ నుంచి గెలిచినా ప్రతిపక్షానికి సహకరిస్తున్నారని… నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి రఘురామ అని అన్నారు. దళితులు ఓట్లు వేస్తేనే రఘురామ ఎంపీ అయ్యారని… అలాంటి వాళ్లపై చెప్పుకు కుట్టుకునేవాళ్లంటూ అసూయతో కూడిన వ్యాఖ్యలు రఘురామ చేశారని నందిగం సురేష్ మండిపడ్డారు. తనకు కేంద్రం ఇచ్చిన సెక్యూరిటీ ద్వారా కాల్చిపారేస్తానని కామెంట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్రం సెక్యూరిటీ ఎందుకు ఇచ్చిందో గుర్తుంచుకోవాలని రఘురామకు సూచనలు చేశారు. రఘురామ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఎస్సీ కమిషన్ కేసు పెడతామని పేర్కొన్నారు. రఘురామ ముక్కు నేలకు రాసి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని సూచించారు. రఘురామ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి ఆస్తులు సంపాదించాడని అన్నారు. త్వరలో దళిత సంఘాలు రఘురామకు తగిన బుద్ధి చెబుతాయని పేర్కొన్నారు.

Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?