వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సీఎం జగన్ మగాడని అనుకున్నానని.. కానీ జగన్ తన స్థాయిని తగ్గించుకున్నారంటూ రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రఘురామ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ ఢిల్లీలో పార్లమెంట్ బయట రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
సీఎం జగన్ ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని రఘురామ అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే పాలన చేయవద్దని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎదురు తిరిగే పరిస్థితి తీసుకురావద్దని కోరారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పారు. ఎవరికీ ఎటువంటి సమస్యలు లేకుండా న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని సూచించారు.
ఒక వ్యక్తి తనను చంపేస్తానని గతంలో బెదిరించాడని… ప్రస్తుతం జగన్ తనను బెదిరించిన వ్యక్తితోనే కేసులు పెట్టించడానికి సిద్ధమవుతున్నాడని… భవిష్యత్తులో తనపై కొన్ని కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రఘురామ పేర్కొన్నారు. జగన్ ఎంతో ధైర్యవంతుడు, మొనగాడు, మగాడు అని అనుకున్నానని కానీ ఆయన తన స్థాయిని తగ్గించుకునే పనులు చేస్తున్నారని అన్నారు.
జగన్ తన స్థాయిని తగ్గించుకునే కొద్దీ నా స్థాయి పెరుగుతుందని కామెంట్లు చేశారు. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించారు. తనపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా ప్రజల విషయంలో జగన్ ఉన్నతంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
Also Read : దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?