Chandrababu Arrest: చంద్రబాబు కోరుకుంటుంది అదే

చంద్రబాబుకు ఐటి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు ఖాయమని వైసిపి నేతలు చెబుతున్నారు. అయితే అది అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : September 6, 2023 6:31 pm

Chandrababu Arrest

Follow us on

Chandrababu Arrest: చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనకు 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్య. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అధికారంలోకి రాకుంటే తెలుగుదేశం పార్టీ, ఆపై తన పరిస్థితి తెలియంది కాదు. చేతిలో పవర్ లేకుంటే కేసులు చుట్టుముట్టడం, ప్రత్యర్ధులు పై చేయి సాధించడం బాబు గారికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. అందునా జగన్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఆయన ముందు ఉన్నారు. అందుకే అధికారంలోకి రావాలని చంద్రబాబు బలంగా ఆకాంక్షిస్తున్నారు. అందుకే గతానికి భిన్నంగా.. ఇంకా చెప్పాలంటే తన జీవితం మొత్తం ధారపోస్తూ రాజకీయంలో ఒడ్డుతున్నారు. అయితే బాబు ఓడ్డెక్కుతారా లేదా అన్నది జనాలు చేతుల్లో ఉంది.

చంద్రబాబుకు ఐటి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు ఖాయమని వైసిపి నేతలు చెబుతున్నారు. అయితే అది అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు అరెస్టు కావాలని జగన్ కు ఎప్పటి నుంచో కోరిక ఉంది. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకు ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. అప్పట్లో తప్పిదాలను చూసి చూడకుండా వదిలేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు, చంద్రబాబుపై కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తనను జైలుకు పంపించడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు అన్నది జగన్ అనుమానం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును వదలకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. కానీ నాలుగున్నర దశాబ్దాల రాజకీయం చేసిన చంద్రబాబు ఎక్కడ జగన్ కు దొరకడం లేదు. ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో వైసిపి హడావిడి చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఖాయమంటుంది. కానీ అంత సీన్ ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తనను అరెస్టు చేయాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులకు సైతం స్పష్టమైన హింట్ ఇచ్చారు. రేపు మా పోతనను అరెస్టు చేయబోతున్నారు అని సంకేతాలు ఇచ్చారు. అదే జరిగితే సానుభూతి పవనాలు వీస్తాయి అన్నది చంద్రబాబు ప్లాన్. కానీ కేసు చూస్తే చిన్నది. కేవలం ఆదాయ పన్ను శాఖ నోటీసు మాత్రమే ఇచ్చింది. అంతమాత్రానికి అరెస్టు చేస్తారా? ఐటీ కి అధికారం ఉందా? లేకపోతే ఈడి ఎంటర్ అవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన వారు మాత్రం.. ఆయన అరెస్ట్ అంత ఈజీ కాదని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం తనంతట తానుగా అరెస్టు తప్పదని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.