
Sajjala Ramakrishna Reddy: ఏపీ అధికార పార్టీ వైసీపీ రోజుకింత డైలామాలో పడిపోతోంది. ముందుగా ఎంతో బలంగా కనిపించిన పార్టీ అధికారంలోకి వచ్చాక రోజుకో మలుపుతిరుగుతోంది. పార్టీని ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను అమితంగా నమ్మినవారికి మాత్రమే.. మిగితా పార్టీ బాధ్యతలు అప్పట్లో అప్పగించారు. అయితే ప్రస్తుతం ఆ నిర్ణయం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కిందిస్థాయి లోకల్ లీడర్ నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు పార్టీలో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణంగా జగన్ మోహన్ రెడ్డి నమ్మిన వ్యక్తులు ప్రస్తుతం పార్టీకి భారంగా మారడం.. అంటే షాడో సీఎంలుగా చలామణి అవుతూ.. ప్రజల్లో.. పార్టీలో వైసీపీని దిగజారుస్తున్నారన్నది లోకల్ నేతల వాదన. అయితే ఇవన్నీ గమనిస్తున్న వైఎస్ జగన్ ఒక్కొక్కటిగా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. మొదట ఉత్తరాంధ్రాలో ఆధిపత్యం చలాయించిన వ్యక్తి ప్రస్తుతం కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వానికి, పార్టీకీ కీలక సలహాదారుడు మైకు దొరికితే చాలు గంటల కొద్ది మాట్లాడే వ్యక్తిపై ప్రస్తుతం వైసీపీ నుంచి తీవ్రమైన వ్యతిరేక వస్తోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రాలో చలాయిస్తున్న ఆధిపత్యంపై స్థానిక నాయకులు ఫిర్యాదు చేయడంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెంటనే పీకే టీం ను రంగంలోకి దింపారు. వారు వారం పదిరోజుల్లోనే పరిస్థితిని చక్కబెట్టారు. దాంతో పాటు అక్కడి రాజకీయ పరిస్థితిపై అత్యవసర రిపోర్టు సైతం సీఎం జగన్ కు అందించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా విజయసాయిరెడ్డి అక్కడి రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. అయితే ప్రస్తుతం జగన్ కు మరో తలనొప్పి పట్టుకుంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ప్రస్తుతం తాను మరో సీఎంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క హోంశాఖకు షాడో మంత్రిగా ఉంటూనే డిపార్టుమెంటును ఆడించేంత అధికారాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన వద్ద పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలు ప్రస్తుతం మరింత విస్తరించాయి. ఒక్క శాఖ నుంచి అన్నిశాఖలకు తన ఆధిప్యతం విస్తరించిందని, ప్రతీశాఖలో వేలు పెడుతూ.. సంక్షేమ పథకాల గురించి తనకే ఎక్కువ అవగాహన ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడని లోకల్ నాయకులు చెబుతున్నారు.
సజ్జల లేని వైసీపీ ప్రభుత్వం లేదన్నంత పరిస్థితిని తీసుకొచ్చాడు. ప్రతీశాఖలో చిన్న విషయం అయినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అవగాహన ఉన్నట్లు సబ్జెక్టుపై మాట్లాడి వెళ్తుండడం సజ్జలకు అలవాటు అయిపోయింది. అయితే ఇన్నాళ్లు.. ప్రభుత్వ పథకాలపైనే మాట్లాడిన ఆయన ప్రస్తుతం పార్టీలోనూ వేలు పెడుతున్నారు. వైసీపీ నిర్ణయాలన్నీ తనపైనే ఆధారపడి ఉన్నాయన్నంతగా ఎదిగిపోయాడు. దీంతో వైసీపీ నేతలు డైలామాలో పడ్డారు. అధికారికంగా.. రాజకీయంగా తానే కీరోల్ గా ఉంటూ.. అధినేతకు దిశానిర్దేశం చేస్తుంటే.. తాము స్థానికంగా డమ్మీ లీడర్లుగా మారుతున్నామని చాలామంది వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయంలో విజయసాయి రెడ్డి రెడ్డిసైతం ఇలాగే ప్రవర్తించడంతో జగన్ తీసుకున్న నిర్ణయంతో సైలెంట్ అయ్యారు. చూడామి సజ్జలపై జగన్ ప్రభావం ఎలా ఉంటుందో..?