https://oktelugu.com/

YCP to Janasena : జనసేనలోకి వైసీపీ నేత.. ఏపీ రాజకీయాల్లో మొదలైన మార్పు

YCP to Janasena : సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎవరూ ప్రతిపక్ష పార్టీలోకి చేరరు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ జంపింగ్ లు ఉంటాయి. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు మొదలయ్యాయంటే దానర్థం. ఇక ఆ పార్టీకి ఏపీలో నూకలు చెల్లినట్టే. ఇప్పుడు ఇదే ఏపీలో జరగబోతోంది. తొలిసారి అధికార వైసీపీ నుంచి ఒక నేత జనసేనలో చేరడం సంచలనమైంది. దీన్ని ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైందని అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2022 9:26 pm
    Follow us on

    YCP to Janasena : సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎవరూ ప్రతిపక్ష పార్టీలోకి చేరరు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ జంపింగ్ లు ఉంటాయి. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు మొదలయ్యాయంటే దానర్థం. ఇక ఆ పార్టీకి ఏపీలో నూకలు చెల్లినట్టే. ఇప్పుడు ఇదే ఏపీలో జరగబోతోంది. తొలిసారి అధికార వైసీపీ నుంచి ఒక నేత జనసేనలో చేరడం సంచలనమైంది. దీన్ని ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైందని అర్థం చేసుకోవచ్చు.

    కొత్త సంవత్సరంలో తెనాలి అభివృద్ధికి పునరంకితం అవుతామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ మేలు జరిగే విధంగా, అభివృద్ధి ఫలాలు అందాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు. శనివారం తెనాలి పట్టణంలోని పినపాడు ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్, వైసీపీ మైనారిటీ నేత శ్రీ జాకిర్ హుస్సేన్ తో సమావేశమయ్యారు. తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరుతున్నట్టు జాకిర్ హుస్సేన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నుంచి చేరికలు జనసేన అధికారానికి దగ్గరి దారి అని అన్నారు.

    గతంలో తెనాలికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలన్న నిబద్ధతతో కలసి పని చేశామని, ప్రస్తుత అధికారంలో ఉన్నవారిలో ఆ నిబద్ధత కరవయ్యిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు మాట్లాడితే సంక్షేమం గురించి మాత్రమే చెబుతున్నారనీ అది నీటి మీద రాత అన్నారు.

    కౌన్సిలర్ గా తన పదవీకాలంలో జాకిర్ హుస్సేన్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా పని చేశారని నాదెండ్ల కొనియాడారు. అప్పట్లో ప్రజల కోసం కలసి పని చేశాం.. ఈ ప్రయాణంలో భాగస్వాములవడానికి మరోసారి ముందుకు వచ్చిన జాకిర్ హుస్సేన్, అతని అనుచరులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

    అనంతరం జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ మైనారిటీలకు శ్రీ జగన్ రెడ్డి న్యాయం చేస్తారని వైసీపీలో చేరి తప్పు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ బండారు రవికాంత్, శ్రీ తోటకూర వెంకటరమణారావు, శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, శ్రీ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.