https://oktelugu.com/

అధికార పార్టీ టార్గెట్‌ బీజేపీ కాదంట.. ఆయనపైనే విమర్శలు

నిజానికి చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు బండి సంజయ్‌ చేపట్టాకనే బీజేపీకి ఊపు వచ్చింది. ఆయన బాధ్యతలు తీసుకున్న వేళా విశేషమా.. లేక ఏదైనా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మానియానే కనిపిస్తోంది. సంజయ్‌ బాధ్యతలు తీసుకొని ఏడాదైనా కాకముందే టీఆర్‌‌ఎస్‌కు దీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. మేజర్‌‌గా రెండు ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీయడంలో కీలక పాత్ర ఆయనది. Also Read: స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్‌ సంజయ్‌ మాటల తూటాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 / 01:18 PM IST
    Follow us on


    నిజానికి చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు బండి సంజయ్‌ చేపట్టాకనే బీజేపీకి ఊపు వచ్చింది. ఆయన బాధ్యతలు తీసుకున్న వేళా విశేషమా.. లేక ఏదైనా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మానియానే కనిపిస్తోంది. సంజయ్‌ బాధ్యతలు తీసుకొని ఏడాదైనా కాకముందే టీఆర్‌‌ఎస్‌కు దీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. మేజర్‌‌గా రెండు ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీయడంలో కీలక పాత్ర ఆయనది.

    Also Read: స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్‌

    సంజయ్‌ మాటల తూటాలు అలాంటివి. ప్రజలను మెస్మరైజ్‌ చేసి.. తమ వైపు తిప్పుకునే ఘనత ఆయనది. అందుకే.. ఆయనకు వస్తున్న ఇమేజీకి ఇప్పుడు అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీలో కుల్లుకుంటున్నారట. అంతేకాదు.. సంజయ్‌ మాటలు టీఆర్ఎస్ నేతల్లో కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్‌‌ను టార్గెట్‌ చేసి ఆయన అంటున్న మాటలు వీర విధేయులకు మండిపోయేలా చేస్తున్నాయి. అరెస్టులు.. జైలు పొర్లు దండాలు అనడమే కాదు అంతకుమించి వ్యక్తిగత విమర్శలూ ఆ మాటల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు కౌంటర్ ఇవ్వకపోతే మరీ అలుసైపోతామని అనుకుంటున్నారేమో కానీ రూటు మార్చారు అధికార పార్టీ లీడర్లు.

    ఇప్పుడు వారి టార్గెట్‌ అంతా బీజేపీ కాదంట.. కేవలం బండి సంజయ్‌ మాత్రమే. అందుకే.. బీజేపీని ఏమీ అనకుండానే బండి సంజయ్‌ను అంటున్నట్లుగానే మాటల దాడి ప్రారంభించారు. ముందుగా బాల్క సుమన్ ఓపెనింగ్ చేశారు. బండి సంజయ్ పై ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన శైలిలోనే తిట్లు లంకించారు. ఇక ముందు.. ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా అదే పద్ధతి పాటించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీని విమర్శించడం మానేసినా అదే అలుసుగా తీసుకుని తమపై బీజేపీ నేతలు.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా ఇదే వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

    Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

    తమ మౌనాన్ని బీజేపీ నేతలు మరో రకంగా తీసుకుని అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని.. దానికి రెస్పాండ్ అవకపోవడం వల్ల ప్రజల్లో కూడా చులకనయ్యే ప్రమాదాన్ని వ్యక్తిగతంగానే రివర్స్ అవడం ద్వారా తప్పించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ మాటల దాడికి బీజేపీ రియాక్షన్‌ను బట్టి తదుపరి రాజకీయం ఉండే అవకాశం ఉంది. మరోవైపు బాల్క సుమన్‌ ఓపెనింగ్‌తో ఇంకా మున్ముందు ఎవరు నోరెత్తుతారనేది ఆసక్తికరంగానే మారింది. మరి బీజేపీ కూడా కౌంటర్‌‌ ఇలా ఇవ్వబోతోందో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్