Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Rajanna Canteens: ఇలా కూడా కటుపుకొట్టారన్న మాట.. క్యాంటీన్ల కథ కంచికేనా?

YSRCP Rajanna Canteens: ఇలా కూడా కటుపుకొట్టారన్న మాట.. క్యాంటీన్ల కథ కంచికేనా?

YSRCP Rajanna Canteens: ‘అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు’.. ఈ సామెతకు అచ్చుగుద్ది సరిపోతారు ఏపీలో వైసీపీ నేతలు..కొందరు మనకు సహాయం చెయ్యకపోగా, వేరే మార్గాల ద్వారా కూడా సహాయం పొందనీయరు అన్నట్టుంటుంది వైసీపీ నేతల తీరు. ప్రభుత్వం అన్నం పెడుతున్నప్పుడు పోటీగా తాము పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే ప్రభుత్వంతో పాటు తాము పెట్టడాన్ని నిలిపేశారు. నిరుపేదల కడపు కొట్టేశారు. వైసీపీ విపక్షంలో ఉన్నపుడు అన్న క్యాంటీన్లకు దీటుగా ‘రాజన్న క్యాంటీన్లు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్న క్యాంటీన్ల లో ఫుడ్ ఒక ఫుడ్డేనా.. మేము చూడండి బాగా ఇస్తామంటూ నాడు వైసీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాడు చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్లను మంచి స్పందన రావడంతో వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకూ పదుల సంఖ్యలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు రాజన్న క్యాంటీన్లు పెట్టారు. అప్పట్లో అన్న క్యాంటీన్లు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని.. వైసీపీ మైలేజ్ ను పెంచేందుకు తామూ కూడా తక్కువకే భోజనం పెడతామని రాజన్న క్యాంటీన్లు పెట్టారు. రూ.ఐదుకే భోజనం ఉంటుందని.. ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు. అయితే ఆ నమ్మకాన్ని వైసీపీ నేతలు వమ్ము చేశారు.

YSRCP Rajanna Canteens
Rajanna Canteens

Also Read: Himba Tribe: జీవితంలో వాళ్లు ఒక్కసారే స్నానం చేస్తారు.. మిగతా రోజుల్లో ఏం చేస్తారో తెలుసా??

తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్నక్యాంటీన్లను వైసీపీ రాగానే నిలిపివేసింది. వాటితో పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు.. ఎక్కడా వారి క్యాంటీన్లు కూడా నడవడం లేదు. పేదలకు రూ. 5 భోజనం అందుబాటులో లేకుండా పోయింది. అంతే కాదు.. తాము పెట్టిన రాజన్న క్యాంటీన్లనూ మూసేశారు. తాము పెట్టడం లేదు.. ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు.ఇప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లు పెట్టిన దగ్గరే.. దాతల సాయంతో…భోజన ఏర్పాట్లు చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు వీలైనంతగా… కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం.. ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు..పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా… భోజనం పెడుతున్న టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే కడుపు నింపడం కాదు.. కడుపు కొట్టడం అంటే ఇదేనేమో..?

YSRCP Rajanna Canteens
Anna Canteen

Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికీ బిగ్ షాక్… ఆ టాక్ ఏంటీ వచ్చిన కలెక్షన్స్ ఏంటీ?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular