YCP Attacks: ఏపీ రాజకీయాలు మరీ బూతులమయం అవుతున్నాయి.. ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ‘రేయ్.. బోసిడికే’ అని టీడీపీ నేత పట్టాభి అనడం.. మాటల మంటలు అంటుకోవడం.. వైసీపీ నేతల ఆగ్రహ జ్వాలల్లో టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు తగలబడడం మనం చూశాం.. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక.. తప్పు ఎవరిది అంటే ఎవరికి వారు మాది కాదంటున్నారు. కానీ.. రాజకీయాలన్నాక పార్టీ నేతలకు ఎంతో ఓర్పు.. సహనం ఉండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను తిట్టినంతగా దేశంలో ఎవరినీ తిట్టలేదని.. బండ బూతులు సైతం తాను తిన్నానని ఇటీవల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఆ తిట్లే తనకు వరాలై తెలంగాణ సాధించానన్నారు. కానీ ఏపీలో ట్రెయిన్ రివర్స్ గా నడుస్తోంది. ఏపీలోని వైసీపీ సర్కార్ విమర్శలను అస్సలు సహించడం లేదు. జీర్ణించుకోవడం లేదు. పైగా ఎదురుదాడికి దిగుతోంది.
విమర్శలనే రాళ్లను మెట్లుగా మలిచి రాజకీయ అగ్రస్థానం చేరాల్సిన వైసీపీ పార్టీ ఇప్పుడు ఎదురుదాడితో అభాసుపాలవుతోంది. మొన్న పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ వేడుకలో సినీ ఇండస్ట్రీకి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావిస్తే దానిపై వైసీపీ బ్యాచ్ ఎంత రచ్చ చేసి పవన్ ను ఎంతగా దిగజార్చిందో మనం చూశాం.. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బూతులు తిట్టాడని ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లు, కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. ఏపీలో అసలు వైసీపీ మూకలకు అస్సలు ఓపిక లేకుండా.. అధిష్టానం ఇంతగా ప్రోత్సహిస్తుందా? అన్న సందేహాలు కలుగకమానదు..
అధినేత సక్కగుట్టే.. వారి క్యాడర్, నేతలు లైన్లో ఉంటారు. ఇక్కడ జగన్ మౌనం అంతుచిక్కకుండా ఉంది. విమర్శించిన పవన్ ను, పట్టాభి విషయంలో వైసీపీ అనుసరించిన వైఖరి ఏమాత్రం సహేతుకంగా లేదంటున్నారు. విమర్శలకు ప్రతివిమర్శ వరకూ ఓకే.. కానీ ఈ ఎదురుదాడి రాజకీయం ఏంటనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది..
దీన్ని బట్టి ఏపీ అధికార పార్టీ వైసీపీకి ప్రజలు ఎంత మైలేజ్ ఇచ్చినా.. ప్రతిపక్షాలను ఎంత తొక్కిపడేసినా కూడా ఆ గెలుపు హోదాను అనుభవించలేకపోతోందని అర్థమవుతోంది. అంత మెజార్టీ.. అంత ప్రజానీకం మద్దతు ఉన్నాక కూడా పట్టుమని 20 సీట్లు గెలవని ప్రతిపక్షాల విమర్శలను వైసీపీ అధిష్టానం జీర్ణించుకోకపోవడం నిజంగా దారుణమే..
మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేయగలదు. కానీ కేటీఆర్ పద్దతిగా కోర్టుకు వెళ్లి వారి ఆగడాలకు న్యాయపరంగా ఎదుర్కొన్నారు. అంతేకానీ అధికారం ఉంది కదా అని దాడులు చేయలేదు.కానీ ఏపీలోని వైసీపీ మాత్రం విమర్శలను తట్టుకోలేకుండా ఎదురుదాడులు చేస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రశ్నిస్తే కొట్టేస్తారా? ఎంత మందిని కొడుతారు? 40 ఇయర్స్ పాలిటిక్స్ తనపై కూడా బండబూతులు తిడుతారా? ఇన్నేళ్ల రాజకీయంలో ఇలాంటివి చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు బోరుమన్నాడంటే వైసీపీ రాజకీయం ఏ లెవల్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంత రచ్చ జరుగుతున్నా వైసీపీ అధినేత జగన్ నుంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రావడం లేదు. దీన్ని బట్టి ఈ ప్రతీకార ప్లాన్ల వెనుక ఉన్నది జగన్ యేనా అన్న అనుమానాలు రాకమానదు. కానీ ఆయనమాత్రం దీనిపై స్పందించరు. తన కిందనున్న వైసీపీ దళాన్ని మాత్రం యుద్ధానికి పంపుతారు.. ఏపీలో ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ ‘ఎదురుదాడి రాజకీయం’ ఎటువైపు తిరుగుతుందో చూడాలి మరీ..
-వైసీపీ దాడులకు కారణమైన పట్టాభి వీడియో ఇదే..