YCP VS Janasena: ఇప్పుడు ఏపీలో జనసేన అధికార పక్షానికి ప్రథమ శత్రువు. జనసేన ను టార్గెట్ చేసుకొని ఎన్ని కుట్రలు చేయాలో.. అంతలా చేస్తోంది. పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా టిడిపి తో పొత్తు ప్రయోగాన్ని విఫలం చేయడానికి జనసేన లోనే కొంతమంది నాయకులను ఎంచుకుంది. అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జనసేన ను వీడాలని చాలామంది నాయకులకు ప్రోత్సాహం అందిస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా జనసేన లో ఉంటూ కోవర్టులుగా మారిన ప్రో వైసిపి నేతలే ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో పవన్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఉండండి.. లేకుంటే వెళ్లిపోవచ్చని స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు.
పవన్ ఎవరితో సంప్రదించకుండా పొత్తుల ప్రకటన చేశారని కొందరు జనసేన నాయకులతో వైసిపి హై కమాండ్ చెప్పించే ప్రయత్నం చేస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలతో పవన్ పై విషం చిమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు బయటకు వెళ్లి బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే నేరుగా వైసిపి కండువా కప్పుకుని మరీ మాట్లాడుతున్నారు. వైసీపీ స్క్రిప్టును చదువుతున్నారు. ముఖ్యంగా పొత్తునే టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు.
చాలామంది నాయకులు జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారు. అటు అధికార వైసిపి నాయకులు సైతం జనసేన వైపు చూస్తున్నారు. దీంతో వైసిపి అధినాయకత్వం కలవరపడుతోంది. వారిని అడ్డుకోవడానికి… జనసేనలోని ప్రోవైసిపీ నేతలను చేరదీస్తోంది. జనసేన నుంచి వైసీపీకి వలసలు ఉన్న తరుణంలో వారిని పునరాలోచనలో పెట్టాలని ఇటువంటి దురాలోచనతో వైసిపి ముందుకు సాగుతోంది. పవన్ ను సీఎం పదవిలో చూడాలని ఉందని.. కానీ ఆ పరిస్థితి లేదని.. అందుకే తాము పార్టీని వీడుతున్నట్లు నేతలు ప్రకటనలు చేసి జనసేన ను వీడుతున్నారు. వైసీపీలో చేరుతున్నారు.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. పార్టీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరి అభిప్రాయంతోనని.. తన వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని తాజాగా ప్రకటించారు. అటు సీఎం పదవి పై సైతం నేను రాజీ పడలేదన్నారు. రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే సీఎం పదవిలో కూర్చునేందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. తనకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని.. వైసిపి విముక్త ఏపీ లక్ష్యమని ప్రకటించారు. పార్టీ శ్రేణులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని.. జగన్ను గద్దె దించే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.మొత్తానికైతే జనసేన టార్గెట్ గా జరుగుతున్న కుట్రను పవన్ బహిర్గతం చేశారు. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ ఎత్తులను చిత్తు చేశారు.