YCP Vs BRS : బీఆర్ఎస్ పై కౌంటర్ స్ట్రాట్ చేసిన వైసీపీ

బీఆర్ఎస్ పై వైసీపీ కౌంటర్ స్ట్రాట్ చేయడంపై మిగతా రాజకీయ పక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. గతంలో అటు కేసీఆర్, ఇటు జగన్ పరస్పర సహాయ సహకారాలు అందించుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటి ప్లాన్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది.

Written By: Dharma, Updated On : May 6, 2023 9:35 am
Follow us on

YCP Vs BRS : రాజుగారి మొదటి భార్య బాగుందంటే.. రెండో భార్య బాగులేదన్న చందంగా మారింది బీఆర్ఎస్ నేతల పరిస్థితి. కేసీఆర్ పాలన బాగుందని చెప్పేందుకు వారు ఏపీని ఉదహరిస్తున్నారు. ఇక్కడ పాలనను తక్కువ చేసి చూపుతున్నారు. దీంతో అవి వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తున్నాయి. తెలంగాణ నేతలు ప్రాంతీయ తత్వంతో ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. వైసీపీ, బీఆర్ఎస్ ల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండడమే ఇందుకు కారణం. స్నేహితుల మధ్య కీచులాటలో రాజకీయం దాగి ఉందన్నది ప్రజల్లో ఉన్న అనుమానం.

గతమంత లేదు..
అయితే బీఆర్ఎస్ విస్తరణ తరువాత వైసీపీతో మునుపటి స్నేహం కనిపించడం లేదు. ఏపీలో పాలబాగాలేదని..ఏపీలో పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలపై తమదైన శైలిలో తెలంగాణ మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. రోడ్లు, పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ,ప్రత్యేక హోదా,రాజధాని వ్యవహారంపై పదేపదే వ్యాఖ్యలు చేస్తూ ఏపీ ప్రభుత్వాన్నిఇరుకున పెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారుపై స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఏపీ మంత్రులకు ఎదురవుతోంది. దీంతో వారు స్ట్రాంగ్ గా రియాక్టవుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో పాలక పక్షాల మధ్య అగాధం ప్రారంభమయ్యింది.

ఏపీ మంత్రి రియాక్షన్..
తాజాగా ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలంగాణ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సంస్కృతిని కాపాడలేకపోతున్న స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడే అర్హత తెలంగాణ మంత్రులకు లేదన్నారు. ఆంధ్ర ప్రజల వల్లే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని …ఆ విషయం మరిచిపోవద్దన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను  అక్కడి ప్రతిపక్షాలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.  డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని.. మానుకోకుంటే మూల్యం తప్పదని హెచ్చరించారు.

రాజకీయ లబ్ధి కోసమేనా?
బీఆర్ఎస్ పై వైసీపీ కౌంటర్ స్ట్రాట్ చేయడంపై మిగతా రాజకీయ పక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. గతంలో అటు కేసీఆర్, ఇటు జగన్ పరస్పర సహాయ సహకారాలు అందించుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటి ప్లాన్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. ఉభయ రాష్ట్రాల మధ్య కీచులాటతో సెంటిమెంట్ పండించి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలని చూస్తున్నట్టు ఉందన్న అనుమానం ఉంది. ఈ ఏడాది చివరిలో తెలంగాణకు, వచ్చే ఏడాది వేసిలో ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఎన్ని రాజకీయ విన్యాసాలు ఉంటాయో చూడాలి మరీ.