Sharmila Vs YCP: వైసీపీ నేతలకు ఇప్పుడు పగలు కూడా కలలో కనిపిస్తున్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇన్నాళ్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టిగా షర్మిలను ఆకాశానికి ఎత్తేశారు. అన్నను విభేదించి తెలంగాణ రాజకీయాలు చేసినా ఆహ్వానించారు. జగన్ మాదిరిగా సక్సెస్ కావాలని ఆశీర్వదించారు కూడా. కానీ ఆ ఆశీర్వచనాలు ఫలించలేదు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆమె భవిష్యత్తును వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీకి చేరారు. తెలంగాణ నుంచి యూటర్న్ తీసుకున్నారు. ఏపీ రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఏకంగా పిసిసి పగ్గాలు అందుకొని జగన్ తో పాటు వైసీపీ శ్రేణులకు కొరకరాని కొయ్యగా మారారు. దీంతో వైఎస్ షర్మిల కాస్త.. మురుసుపల్లి షర్మిలగా మారిపోయారు. రాజన్న బిడ్డ అని మురిసిపోయిన వారే.. ఆమెపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆమెను నమ్మిన వందలాదిమంది యువత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. ఆ పార్టీ తమకు ఒక ప్లాట్ ఫామ్ గా నిలుస్తుందని భావించారు. కానీ తాను ఆశించిన స్థాయిలో ప్రజల ఆదరణ దక్కకపోయేసరికి షర్మిల పునరాలోచనలో పడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి భే షరతుగా మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని వందలాది మంది నాయకులు నిరసన గళం వినిపించారు. లోటస్ ఫండ్ వద్ద ఆందోళన చేశారు. షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆమె తమను రాజకీయంగా నట్టేట ముంచారని కొంతమంది కన్నీరు పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ గా మారారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పీసీసీ పగ్గాలు అందుకున్న తరువాత వైసిపి తో పాటు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. అదే స్థాయిలో వైసీపీ నేతలకు ఆమె సైతం టార్గెట్ అయ్యారు. కిందిస్థాయి నాయకుల నుంచి అగ్రనేత జగన్ వరకు షర్మిల అంటేనే మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు, ఆమెపై తెలంగాణ యువత చేసిన కామెంట్స్, ఆమె వెంట నడిచిన నాయకుల అభిప్రాయాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసిపి సోషల్ మీడియా ఎక్కువగా ట్రోల్ చేస్తోంది. పోస్టులు పెడుతుండడం, వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తుండడం కనిపిస్తోంది. పాత వీడియోలతో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ పోస్టింగులు ఉంటున్నాయి. ఇప్పటికే వీటిపై షర్మిల స్పందించారు. తాను ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. అయినా సరే షర్మిలపై ట్రోల్స్ ఆగడం లేదు.
లోటస్ పాండ్ లో షర్మిల డౌన్ డౌన్… మాకు న్యాయం చెయ్యాలి అంటూ ధర్నా….
మొరుసుపల్లి షర్మిల ని నమ్మి కోట్లు నష్టపోయాము…. మాకు న్యాయం చెయ్యాలి షర్మిల అంటూ వాళ్ళ బాధను మీడియా తో చెప్పుకొంటున్నారు.#MorusupalliSharmila pic.twitter.com/ap8NrhoBH3
— Anitha Reddy (@Anithareddyatp) January 30, 2024