MLC Candidates: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఖాళీగా ఉన్న 14 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు నడుం బిగించింది. ఈ మేరకు అధినేత జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై ఇప్పటికే ఓ కొలిక్కి తెచ్చారు. ముందుగానే అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదించిన వారి జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లాలో పాలవలస రాజశేఖర్ కుమారుడు విక్రాంత్ ను ఓకే చేశారు. కర్నూలు జిల్లా నుంచి నంద్యాలకు చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాషా పేర్లు ప్రకటించారు. విజయనగరం నుంచి రఘురాజు ఖరారు చేశారు. విశాఖపట్నం నుంచి వంశీ కృష్ణ, విరుదు కల్యాణి పేర్లు ఫైనల్ చేశారు. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్, కృష్ణా జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుడు తలశిల రఘురాంకు కేటాయించారు.
గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్ పేర్లు చేర్చారు. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ విశ్వేశ్వర్ రెడ్డి, కుప్పం నుంచి భరత్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పదకొండు మంది పేర్లను త్వరల ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Cinema Ticket: ఏపీలో ఇక సినిమా టికెట్లు ఆన్ లైన్ లోనే.. లాభమా.? నష్టమా?
ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై అధినేత జగన్ పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణల మేరకు కూడా అన్ని కోణాల్లో ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఓకే చేసినట్లు చెబుతున్నారు.
Also Read: Jagan Sarkar: కిక్కూ ఎక్కడిదిక.. మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్