RRR: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలు అయింది. అయితే, రెండు షెడ్యూల్స్ లోనే షూటింగ్ ఫినిష్ చేయాలని టీమ్ ముందు నుంచీ పక్కా ప్లాన్ చేసుకుంది. ఆ విధంగానే అనుకున్న టైమ్ కు షూట్ ను పూర్తి చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
అందుకే ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి బరిలో నిలవాలని ‘బంగార్రాజు’ సన్నాహాలకు రెడీ అవుతుంది. అయితే ఇక్కడ ఓ లెక్క ఉంది. “ఆర్ఆర్ఆర్ ” కనుక బాహుబలి రేంజులో హిట్టయితే నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పిస్తారు. ఒకవేళ “ఆర్ఆర్ఆర్” బాక్సాఫీస్ వద్ద పెద్దగా పేలలేదు అంటే… సంక్రాంతి వేవ్ లోకి ‘బంగార్రాజు’ను పట్టుకొస్తారు.
కాకపోతే, ‘బంగార్రాజు’కి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయి అన్నదే డౌట్. ఎందుకంటే.. గత నాలుగేళ్లలో నాగార్జున నటించిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. అసలు హిట్ మాట దేవుడెరుగు ? కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న నాగార్జున ఎందుకు సంక్రాంతి పోటీలో రావడం ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ నాగార్జున చేతిలో లేదు. ‘బంగార్రాజు’ సినిమాకి మొత్తం ఫండింగ్ చేసింది జీ స్టూడియో సంస్థ. కేవలం ఆ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాని తీసింది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో తుది నిర్ణయం జీ స్టూడియో సంస్థదే.
Also Read: Radhe Shyam: ప్చ్.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’కి ఏమైంది ?
మిగిలిన సినిమాల హిట్ టాక్ ను బట్టి.. ‘బంగార్రాజు’ను సంక్రాంతి కావొచ్చు, రిపబ్లిక్ డే స్పెషల్ గా కావొచ్చు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” మాత్రమే పోటీలో ఉంటే నాగార్జున తన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి బరిలో దింపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
Also Read: Samantha: సమంత త్రివిక్రమ్ ను కలిసింది.. కానీ.. !