సుప్రీం కోర్టు తాజాగా అవినీతి, ఆర్థిక పరమైన కేసులలో తీర్పు సంవత్సరాల తరబడి ఆలస్యమవుతున్న నేపథ్యంలో వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు అవినీతి, ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దేశంలో అవినీతి, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో పెండింగ్ లో ఉన్న 2,500 కేసులు రాజకీయ నాయకులకే సంబంధించినవి కావడం గమనార్హం.
Also Read : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విజయసాయి..?
తాజాగా సుప్రీం ఆదేశాల గురించి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సుప్రీం ఆదేశాలతో భయపడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో 12 ఛార్జిషీట్లు జగన్ కు సంబంధించినవేనని చెప్పారు. నేడు మీడియాతో మాట్లాడుతూ యనమల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసులపై విచారణ జరుగుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నాడని చెప్పారు.
జగన్ ఏసీబీ విచారణలను వెలుగులోకి తీసుకురావడానికి అసలు కారణం ఇదేనని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనపై జగన్ సర్కార్ విచారణ చేయిస్తానని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకే ఐదేళ్ల పాలనపై విచారణ చేయిస్తామన్నా హైకోర్టు స్టే ఇచ్చిందని యనమల పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పత్రికా హక్కుల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రకటన ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్ సొంత పత్రిక సాక్షి నిబంధనలను పాటించడం లేదని యనమల అన్నారు. జగన్ సర్కార్ ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని సూచించారు. గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిన యనమల జగన్ సర్కార్ ను ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శల విషయంలో వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?