https://oktelugu.com/

యాదవులకే పెద్దపీట?

రాజకీయాలకు కులమే బలం. కులంతోనే ఓటు బ్యాంకు ఉంటుంది. ఓట్లు సాధిస్తారు. ఫలితంగా ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తారు. అటువంటి కులాన్ని ఏ పార్టీ కూడా కాదనదు. తమ వైపు తిప్పుకోవడానికి పాచికలు వేస్తారు. వారి ఓట్లతో గెలిచి వారికి మరిన్ని తాయిలాలు అందిస్తారు. తాజాగా విశాఖపట్నంలో జరుగుతుంది అదే. ఇన్నాళ్లు టీడీపీకి మద్దతుగా ఉన్న యాదవులను వైసీపీ తన వైపు తిప్పుకుంది. విశాఖలో పాతికలక్షల మంది జనాభా ఉంటే ఇందులో మూడో వంతు యాదవ సామాజిక వర్గమే. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 8, 2021 9:30 am
    Follow us on

    రాజకీయాలకు కులమే బలం. కులంతోనే ఓటు బ్యాంకు ఉంటుంది. ఓట్లు సాధిస్తారు. ఫలితంగా ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తారు. అటువంటి కులాన్ని ఏ పార్టీ కూడా కాదనదు. తమ వైపు తిప్పుకోవడానికి పాచికలు వేస్తారు. వారి ఓట్లతో గెలిచి వారికి మరిన్ని తాయిలాలు అందిస్తారు. తాజాగా విశాఖపట్నంలో జరుగుతుంది అదే. ఇన్నాళ్లు టీడీపీకి మద్దతుగా ఉన్న యాదవులను వైసీపీ తన వైపు తిప్పుకుంది.

    విశాఖలో పాతికలక్షల మంది జనాభా ఉంటే ఇందులో మూడో వంతు యాదవ సామాజిక వర్గమే. వారే ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను గెలుపును శాసిస్తారు. దీన్ని పసిగట్టిన వైసీపీ తెలివిగా ఆ సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటోంది. వారికే మేయర్ పదవిని కట్టబెట్టింది. ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన16 మందికి టికెట్లు కేటాయించగా అందులో 13 మంది గెలిచారు.

    విశాఖ నగర రాజకీయాల్లో యాదవులకే పెద్దపీట వేసింది వైసీపీ. యాదవులు గెలుపులో భాగంగా ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్నారు. దీంతో పార్టీ వారి కోసం పార్టీ చేయాల్సింది చాలా ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మరి కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా ఒక పార్కును నిర్మిస్తామని చెప్పారు. వారి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

    విశాఖ మేయర్ పదవి చరిత్రలో తొలిసారిగా యాదవులకు దక్కింది. ఇప్పటిదాకా డిప్యూటీ మేయర్ తోనే వారు కాలం గడిపారు. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వారికి మేయర్ పదవి అప్పగించింది. రానున్న రోజుల్లో ఎంపీతోపాటు ఎమ్మెల్యే టికెట్లు, రెండు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్ పదవులు ఈ సామాజిక వర్గానికి రావచ్చు. టీడీపీ నుంచి వైసీపీకి బదిలీ అయిన యాదవుల మద్దతును పది కాలాల పాటు కాపాడుకోవాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది.