అన్నగా లోకేష్ అవతారం?

రాజకీయాల్లో అన్నకు ఉన్న గుర్తింపే వేరు. ఎన్టీఆర్ యావత్ తెలుగు జాతిగా అన్నగా మారి ఎన్నో విజయాలు అందుకున్నారు. అదేవిధంగా చాలా మంది తమను జనానికి ఏదో బంధువుగా చెప్పుకుంటూ కలిసిపోతారు. దీంతో ఓట్లు రాబట్టుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటారు. తమిళనాడులో జయలలిత అందరికీ అమ్మగా గుర్తింపు పొందారు. బెంగాల్ లో మమతా బెనర్జీని దీదీగా చెప్పుకుంటారు. ఇలా రకరకాల బంధుత్వాలతో నాయకులు జనంతో పెనవేసుకుంటారు. ఇపుడు ఇదే కోవలో నారా లోకేష్ నిలుస్తున్నారు. అందరికీ అన్నగా […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 9:36 am
Follow us on

రాజకీయాల్లో అన్నకు ఉన్న గుర్తింపే వేరు. ఎన్టీఆర్ యావత్ తెలుగు జాతిగా అన్నగా మారి ఎన్నో విజయాలు అందుకున్నారు. అదేవిధంగా చాలా మంది తమను జనానికి ఏదో బంధువుగా చెప్పుకుంటూ కలిసిపోతారు. దీంతో ఓట్లు రాబట్టుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటారు. తమిళనాడులో జయలలిత అందరికీ అమ్మగా గుర్తింపు పొందారు. బెంగాల్ లో మమతా బెనర్జీని దీదీగా చెప్పుకుంటారు. ఇలా రకరకాల బంధుత్వాలతో నాయకులు జనంతో పెనవేసుకుంటారు.

ఇపుడు ఇదే కోవలో నారా లోకేష్ నిలుస్తున్నారు. అందరికీ అన్నగా చెప్పుకుంటూ జనంలో కలుస్తున్నారు. పది పరీక్షలురద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అంతే కాదుపరీక్షలు రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు తనను తాను అన్నగా సంబోధిస్తున్నారు. ఇకపై లోకేష్ అన్నగానే మీ వెంట ఉంటానని హామీ ఇస్తున్నారు.

నేటీ టీనేజర్లే రేపటి ఓటర్లు. అందుకే లోకేష్ అన్నగా రూపాంతరం చెందాలని భావిస్తున్నారు. అప్పట్లో జగన్ కూడా యువ నేతగా బాగా ప్రమోట్ చేసుకున్నారు. దీంతో విద్యార్థిలోకం నుంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఎన్నికల్లో కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా అన్న లాగా అవతరించాలని ఆరాటపడుతున్నారు. రానున్న రోజుల్లో యువతకు సంబంధించి మరిన్ని సమస్యలను టార్గెట్ చేస్తూ జనంలోకి వచ్చే అవకాశాలున్నాయి.

వయసు కూడా లోకేష్ కు కలిసొచ్చే అంశం. వచ్చేఎన్నికల నాటికి జగన్ 50 ఏళ్లు దాటి పోతారు. లోకేష్ కు మాత్రం 40 దాటుతాయి. దీంతో యువతకు బాగా దగ్గరయ్యేందుకు లోకేష్ పథకం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో యువత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో లోకేష్ యువతను ఆకట్టుకోవడానికి అన్నగా అవతారం ఎత్తుతున్నారని సమాచారం. ఫ్యామిలీ సెంట్ మెంట్ కూడా కలుపుకుంటే రాజకీయ చిత్రం సూపర్ హిట్ అవుతుందని మేధావుల అంచనా.