https://oktelugu.com/

తెలుగు ప్రజలకు ఇది తీపి కబురు

నైరుతి రుతుపవనాలు నిన్ననే తెలుగురాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకిన ఈ రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ, ఏపీలో వ్యాపించి వానలు కురిపిస్తున్నాయి. అయితే ఈ రుతుపవనాలకు బూస్ట్ ఇచ్చేలా పరిణామం చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఈనెల 11వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ అంచనావేసింది. క్రమంగా ఇది తుఫాన్ గా మారి రుతుపవనాలకు మరింత బూస్ట్ నిచ్చి తెలుగురాష్ట్రాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2021 / 08:55 AM IST
    Follow us on

    నైరుతి రుతుపవనాలు నిన్ననే తెలుగురాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకిన ఈ రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ, ఏపీలో వ్యాపించి వానలు కురిపిస్తున్నాయి. అయితే ఈ రుతుపవనాలకు బూస్ట్ ఇచ్చేలా పరిణామం చోటుచేసుకుంది.

    బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఈనెల 11వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ అంచనావేసింది. క్రమంగా ఇది తుఫాన్ గా మారి రుతుపవనాలకు మరింత బూస్ట్ నిచ్చి తెలుగురాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించే అవకాశాలున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రమంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలకు ఇవి తోడవుతాయని చెబుతున్నారు.

    సముద్ర ఉపరితలానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని.. ఇది అల్పపీడనంగా మారబోతోందని.. పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్యలో ఇది ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఈ తరహా వాతావరణం వల్ల నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలి తెలుగు రాష్ట్రాలు, దేశమంతా విస్తారంగా వానలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ అల్పపీడనం తుఫాన్ గా మారడానికి అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు.

    బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ అల్పపీడం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈనెల 10వ తేదీ నుంచి ఒడిషా, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక చత్తీస్ ఘడ్ ను ఆనుకొని ఉన్న ఉత్తర తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు మహారాష్ట్రలో ప్రవేవించాయని.. ఈ అల్పపీడనంతో వర్షాలు పడుతాయని అంటున్నారు. నైరుతి రుతుపవనాలకు ఇది తోడు కావడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు, మధ్య భారత్, ఈశాన్య రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.