https://oktelugu.com/

Vivek Agnihotri: అనుకూలంగా తీస్తే అంతే.. ‘ది కశ్మీర్ ఫైల్స్ ’ దర్శకుడికి వై కేటగిరి భద్రత కల్పించిన మోడీ సర్కార్

Vivek Agnihotri: ద కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చలన చిత్ర రంగంలో ఓ మోత మోగిస్తోంది. బాక్సాఫీసు కలెక్షన్లు సంచలనం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలోనే వంద కోట్ల గ్రాఫ్ సాధించి సరికొత్త రికార్డు తిరగరాసింది. చిత్రానికి వస్తున్న వసూళ్లు చూస్తుంటే బాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పరిశ్రమనే ఓ కుదుపు కుదిపేస్తోంది. చలన చిత్ర రంగంలోనే అత్యంత కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా పేరు సాధించింది. చిత్ర దర్శకుడు  […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2022 / 02:03 PM IST
    Follow us on

    Vivek Agnihotri: ద కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చలన చిత్ర రంగంలో ఓ మోత మోగిస్తోంది. బాక్సాఫీసు కలెక్షన్లు సంచలనం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలోనే వంద కోట్ల గ్రాఫ్ సాధించి సరికొత్త రికార్డు తిరగరాసింది. చిత్రానికి వస్తున్న వసూళ్లు చూస్తుంటే బాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పరిశ్రమనే ఓ కుదుపు కుదిపేస్తోంది. చలన చిత్ర రంగంలోనే అత్యంత కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా పేరు సాధించింది.

    Vivek Agnihotri

    చిత్ర దర్శకుడు  వివేక్ అగ్నిహోత్రి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాలో కశ్మీరీ పండిట్లను హింసించే కోణంలో ముస్లింలను దోషులుగా చూపడంతో ఆ వర్గంలో ఆగ్రహాలు వస్తున్నాయి. అగ్నివేష్ కు బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో అతడు హోం మంత్రి అమిత్ కు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. దీంతో వివాదాల చిత్రంగా ద కశ్మీర్ ఫైల్స్ రికార్డులకెక్కింది.

    Also Read: హీరో బాలకృష్ణ డిమాండ్ కు ఆయన ఫ్యాన్ సీఎం జగన్ ఓకే.. చంద్రబాబుకు షాక్

    గతంలో నటి కంగనా రనౌత్ కు వై కేటగిరీ రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే ఆమెకు రక్షణ కల్పించడం వేరు వివేక్ అగ్నిహోత్రి కు భద్రత కల్పించడం వేరని చర్చ వస్తోంది. సినిమాల నిర్మాణంలో అందరికి స్వేచ్ఛ ఉన్నా ఎందుకు వారిలో అంత అక్కసు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి వివేక్ వివేక్ అగ్నిహోత్రి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.

    The Kashmir Files

    ఈ క్రమంలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఓ వర్గానికి వ్యతిరేకంగా సినిమాలు తీసే వారికి భద్రత కల్పించడం ఏమిటని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ రక్షణ కోసం అభ్యర్థించిన వారికి వారి స్థాయిని బట్టి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని చెబుతోంది. దీంతో ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం కలెక్షన్ల పరంగానే కాకుండా భద్రత పరంగా కూడా రికార్డులు సాధించడం గమనార్హం. అగ్నివేష్ కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ రేట్లు భారీగా పెంపు.. ప్రేక్షకులకు ఇది షాక్!

    Recommended Video:

    Tags