NHAI: ఇంటికి చిన్నపాటి పునాదికే రోజులు పడుతున్నాయి. అటువంటిది అయిదు రోజుల్లో ఏకధాటిగా 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మించి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ . గల్ఫ్ దేశం ఖతర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టింది. నూతన అధ్యయనాన్ని స్రుష్టించింది. ప్రపంచ ఖ్యాతికెక్కింది. రహదారి నిర్మాణ ద్రుశ్యాలు, గిన్నీస్ సంస్థ అందించిన ధ్రువపత్రాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ట్విటర్ లో షేర్ చేశారు. దీంతో ఎన్ హెచ్ ఏఐకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకూ జాతీయ రహదారి 53పై… 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎన్ హెచ్ ఏఐ శ్రీకారం చుట్టింది. నిర్మాణ బాధ్యతలను రాజ్ పూత్ ఇన్ ఫ్రా అనే సంస్థకు అప్పగించింది. దీంతో జూన్ 4న ఉదయం 4 గంటలకు పనులు ప్రారంభించింది ఆ సంస్థ. సరిగ్గా 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. దాదాపు 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగస్థులయ్యారు. అహో రాత్రులు శ్రమించి స్వల్ప వ్యవధిలోనే రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. పూర్తి స్వదేశీ నైపుణ్యంతో అతి తక్కువ కాలంలో రోడ్డు నిర్మాణం పూర్తిచేసి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అప్పటివరకూ గల్ఫ్ దేశం ఖతర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా రోడ్డు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాజ్ పూత్ ఇన్ ఫ్రా సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో కూడా సంగ్లీ సకరాల మధ్య 24 గంటల్లో రోడ్డు నిర్మించి రికార్డు నెలకొల్పింది.

ఖతర్ రికార్డును అధిగమించి..
ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ కాలంలో రోడ్డు నిర్మించిన రికార్డు ఖతర్ పేరిట ఉండేది. ఆ దేశానికి చెందిన పబ్లిక్ రోడ్స్ అథారిటీ సంస్థ 10 రోజుల్లో 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మించి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. 2019 ఫిబ్రవరి 17న అల్కార్ ఎక్స్ ప్రెస్ వేలో రోడ్డు నిర్మాణం చేపట్టి ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఇదే ట్రాక్ రికార్డు. దానిని అధిగమించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీంతో ప్రపంచ దేశాల్లో ఎన్ హెచ్ఏఐకు అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. సంస్థకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!
సుదీర్ఘ చరిత్ర
భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఒక స్వతంత్ర సంస్థ ఇది. దీనికికేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ ఒక నోడల్ సంస్థగా వ్యవహిరిస్తుంది.ఇవి భారతదేశంలో ప్రధాన నగరాలు, రాష్టాల రాజధానులు, ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలను కలుపుతు నిర్మింపబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో “భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ చట్టం 1988” ప్రకారం ఏర్పాటుచేసింది.ఈ సంస్థ ద్వారా జాతీయ రహదారుల నిర్వహణ, యాజమాన్య బాధ్యలను నిర్వహింబడేలా చట్టాన్ని రూపొందించడం జరిగింది.1995 లో దీనిని ఒక స్వతంత్ర సంస్థగా రూపొందించడం జరిగింది.

రూపురేఖలు మార్చిన వాజపేయి
దేశంలో అటల్ బిహారీ వాజపేయి అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ రహదారుల రూపురేఖలు మారిపోయాయి.దేశ అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారిని నిర్మించాలన్న యోచనలో భాగంగా నాడు స్వర్ణ చతుర్భుజి పథకాన్ని ప్రారంభించారు. “ఉత్తర-దక్షిణ”,”తూర్పు-పడమర” కారిడార్లను అభివృద్ధి చేయడం, ప్రధాన రేవు పట్టణాలను అనుసంధానించడం పథకం ముఖ్య ఉద్దేశ్యం. నాడు తొలి దశ నిర్వహణకు సుమారు రూ.30,000 కోట్లు కేటాయించారు. భారతదేశంలో గల ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, చెన్నై లను మిగతా ప్రధాన రేవు పట్టణాలతో,ప్రధాన వాణిజ్య కేంద్రాలతో, పారిశ్రామిక ప్రాంతాలతోను అనుసంధానం చేయడానికి దీనిని ప్రారంభించారు.2001 లో ప్రారంభింపబడిన ఈ ప్రాజక్టూ ప్రపంచంలో అనాటికి నిర్మింపబడ్డ అతిపెద్ద రోడ్డు అనుసంధానాలలో ఐదవది.భారతదేశ తూర్పు భాగంలో గల సిల్చేర్ నుండి,పడమర భారతంలో గల పోర్‌బందర్ వరకు ,ఉత్తర భారత దేశం లో గల శ్రీనగర్ నుండి ,దక్షిణ భారత దేశం లో గల కన్యా కుమారి వరకు గల జాతీయ రహదారులను 4లేదా6 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.