World Population Day 2022: ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. వేగంగా జనాభా పెరగడంతో వనరులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఆహారం అందక చాలా మంది అవస్థలు పడుతున్నారు. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు పట్టుకొస్తాయని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక ప్రకారం నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయి దాటుతుందని అంచనా వేస్తోంది. దీంతో వనరుల వినియోగం కూడా ఎక్కువే అవుతోంది. దీంతో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం గగనంగా మారిపోనుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జనాభా ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే పెరుగుతోంది. దీంతో జనాభా పెరుగుదల గుదిబండగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాభా ఇలా పెరిగితే భవిష్యత్ లో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 2050 నాటికి మన దేశంలో వనరులు తగ్గిపోయి ఆకలిమంటలు చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నాలేవి చేయకపోవడం విడ్డూరమే.
Also Read: KCR vs BJP: కేసీఆర్ సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అతడే?
జనాభా పెరుగులతో అనేక సమస్యలు వస్తాయి. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించిపోతాయి. జనాభాకనుగుణంగా అవసరాలు కూడా తీర్చాలి. దీంతో తరాల మధ్య అంతరాలు పెరుగుతాయి. ఆకలికేకలు, ఆరోగ్యం ఇబ్బందులు పెడతాయి. జనాభా పెరుగుదల అన్ని సమస్యలకు మూలంగా మారుతుంది. భవిష్యత్ అవసరాలకు ఆటంకంగా ఉండటం తెలిసిందే. జనాభా పెరుగుదలను అడ్డుకుంటేనే మనుగడ సాధ్యం. లేదంటే సమస్యలే నిత్యం స్వాగతం చెబుతాయి.
అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇండియా, చైనాలే ముందంజలో ఉన్నాయి. జపాన్ కూడా జనాభా పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వనరులు సైతం అంతరించిపోతున్నాయి. అవసరాలకు మించి వాడటంతో సమస్యలే ఎదురుకానున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70 శాతం అదనంగా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి ఆహారం సమృద్ధిగా లభించి ఊబకాయం బారిన పడుతుండగా 65 కోట్ల మందికి ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ఉండటం గమనార్హం. 130 కోట్ల జనాభాలో 15 ఏళ్లకంటే తక్కువ ఉన్న వారి జనాభా 25 శాతం ఉంది. దీంతో యువశక్తిలో భారత్ తన సత్తా చాటుతోంది. యువ జనాభా సగటు వయసు ఇండియాలో 28, చైనాలో 38, జపాన్ లో 48 ఏళ్లుగా ఉంది. దీంతో భారత్ యువశక్తికి పుట్టినిళ్లుగా మారుతోంది. జపాన్ లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని పోషించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జపాన్ లో 65 ఏళ్లు దాటిన వారు 28 శాతం ఉండగా ఇటలీలో 23 శాతం ఉన్నారు. దీంతో వృద్ధులను పోషించేందుకు అక్కడి ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి.
జనాభా ఇలా పెరిగితే భవిష్యత్ లో సమస్యలు ఎక్కువే అవుతాయి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు మరో మూడు భూమండలాలు అవసరమవుతాయి. దీంతో జనాభా పెరుగుల ప్రమాదకరమని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా వందల కోట్ల జనాభా పెరుగుతుంటే వనరులు మాత్రం పరిమితంగా ఉండటమే ఆందోళనకు ప్రధాన కారణం. ఈ సందర్భంలో జనాభా విస్పోటనాన్ని ఆపేందుకు ఆయా దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి. లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటే మంచిది.
Also Read:Pawan Kalyan:మీ కేశ సంపదను ప్రజలే ఖాళీ చేస్తారు జాగ్రత్త!
[…] […]
[…] […]