https://oktelugu.com/

Women’s Reservation Bill: దేవే గౌడ ఆధ్వర్యంలో మొదలైతే.. నరేంద్ర మోడీ హయాంలో పూర్తయింది

మొదటి దఫా అధికారంలో త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మకమైన మార్పులను నరేంద్ర మోడీ తీసుకొచ్చారు.. జిఎస్టి బిల్లు కూడా అటువంటిదే.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2023 / 05:20 PM IST
    Follow us on

    Women’s Reservation Bill: “పాలకుడు గట్టిగా ఉంటే పనులు మొత్తం వెంట వెంటనే పూర్తవుతాయి. ” ఆఫ్రికన్ సామెత ఇది. ఈ సామెతను బిజెపి నాయకులు తమ పాలన తీరుకు అన్వయించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం, ఉపాధి వరకే పరిమితం అయిపోయింది. అయితే ఇందులో ఉపాధి పథకం అనేది చాలావరకు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి వరకే ఆగిపోయింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, అప్పటి పద్ధతులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చలేకపోయింది. ఆ తర్వాత అనేక రకాల కుంభకోణాలు వెలుగు చూడటంతో కాంగ్రెస్ ప్రభ మసకబారింది. ఫలితంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీగా మెజారిటీ ఉండటం, స్వతహాగా దూకుడు కలిగిన మనస్తత్వం ఉన్న నాయకుడు కావడంతో చాలావరకు మార్పులకు బిజెపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    మొదటి దఫా అధికారంలో త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మకమైన మార్పులను నరేంద్ర మోడీ తీసుకొచ్చారు.. జిఎస్టి బిల్లు కూడా అటువంటిదే. అయితే మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల అనేక రకాలైన ప్రతికూల ప్రభావాలను ఈ దేశం చవి చూడాల్సి వచ్చింది. అయితే రెండవ దఫా అధికారం ప్రస్తుతం అనుభవిస్తున్న నేపథ్యంలో మరో కీలకమైన బిల్లులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సోమవారం పొద్దుపోయిన తర్వాత కేంద్ర కేబినెట్ కమిటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతోనే ఇది రుచువందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లు ఆమోదించిన మోడీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అయితే కాసేపటి తర్వాత ప్రహల్లాద సింగ్ పటేల్ ఈ ట్వీట్ డిలీట్ చేశారు. మెంట్ ప్రత్యేక సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైన ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు అవుతాయి.

    చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్ డీ దేవె గౌడ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తోలుత లోక్ సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్ పెయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హాయంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్ సభ లో మాత్రం పెండింగ్లో ఉండిపోయింది. 2014లో లోక్సభ రద్దీ కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోడీ సారథ్యంలోని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే దీనిపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్విట్ చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి చొరవ చూపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.