Ganga swimsuit video viral: గంగా నది.. భారత దేశంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నది. ఏటా కోట్ల మంది ఇందులో పుణ్యస్నానాలు చేస్తారు. నదీ స్నానంతో పాప ప్రక్షాళన అవుతుందని, రోగాలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక చనిపోయిన వారి చితాబస్మాలను గంగా నదిలో కలిపితే పాపాలు తొలగిపోయి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. గంగానది స్నానానికి వెళ్లినవారు అక్కడి నీటిని కూడా తెచ్చుకుని పవిత్రంగా భావిస్తుంటారు. ఈ పవిత్ర గంగా నదిలో ఓ విదేశీ పర్యాటకురాలు ఇటీవల ‘బికిూనీ’ ధరించి స్నానం చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ‘బికి*నీ’ స్నానం ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో జరిగినట్లు తెలిసింది. మహిళ మెడలో పూలదండలు ధరించి గంగా నదిలో దిగి.. దండలను నదిలో విసిరేసి ఈతకొడుతూ వీడియోలో కనిపించింది.
భిన్న అభిప్రాయాలు..
గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేవారు నిండుగా హిందూ సంప్రదాయం ప్రకారం వస్త్రధారణ చేసి స్నానం ఆచరించడం పవిత్రంగా భావిస్తారు. అయితే ఇవేమీ తెలియని విదేశీ మహిళ.. నదీ తీరానికి వచ్చి.. అందరిలా అక్కడి పూలదండలు మెడలో వేసుకుంది. కానీ నదిలో దిగేటప్పుడు వస్త్రాలు వదిలేసింది. ‘బికి*నీ’ తో నదిలో దిగింది. దీనిని పాత తరంవారు, కరుడుగట్టిన హిందూవాదులు తప్పు పడుతున్నారు. పరమ పవిత్ర క్షేత్రం రిషికేష్‌లో గంగా నదిని విదేశీ మహిళ అపవిత్రం చేసిందని విమర్శిస్తున్నారు. పవిత్రంగా పరిగణించే స్థలంలో ఈ రకమైన దుస్తులు ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని అంటున్నారు. పుణ్యక్షేత్రాలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటున్నారు.
వ్యక్తిగత విషయం అని కొందరు..
ఇక కొందరు నెటిజన్లు మాత్రం ‘దుస్తులు వ్యక్తిగత ఎంపిక’ అని సమర్థిస్తున్నారు. ‘పురుషులు లోదుస్తులతో స్నానం చేయడం తప్పు కానప్పుడు మహిళ చేస్తే ఎందుకు తప్పు?‘ అని ప్రశ్నిస్తున్నారు. సాంప్రదాయం అనే పేరుతో మహిళల స్వేచ్ఛను పరిమితం చేయరాదని వారు వాదిస్తున్నారు.
‘బికి*నీ’ స్నానం ఘటన భారతీయ సమాజంలో ఆధునికత, ఆచారం మధ్య జరుగుతున్న విలువల పోరాటాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాల గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిదే కానీ, వ్యక్తిగత స్వేచ్ఛను నొక్కిపెట్టే ప్రయత్నం కూడా సముచితమేం కాదని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులకు స్థానిక సంప్రదాయాలు, ప్రాముఖ్యత తెలియజేయడం ద్వారా ఇలాంటి వివాదాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Maa Ganga is a sacred river, not a beach or a swimming pool. Show respect wear decent attire, not a bikini. pic.twitter.com/KUbyVhw0u3
— Hindutva Vigilant (@VigilntHindutva) October 20, 2025