https://oktelugu.com/

Strange Disease: 40ఏళ్లుగా నిద్రపోని మహిళ..ఎలా బతికింది.. కారణమిదే..

Strange Disease: నిద్రకు ప్రాణులకు దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి ప్రాణి రోజులో ఎంతో కొంత సేపు నిద్ర పోతుంది. నిద్ర లేకపోతే అనారోగ్యం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఓ మహిళ 40 ఏళ్లు నిద్ర లేకుండా ఉండడం గమనార్హం. మనలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతుంటారు. శరీర తీవ్రత దృష్ట్యా నిద్ర మనకు మేలు చేస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని తెలుసు. చికిత్స తీసుకున్నా ఆమె ఈ సమస్య నుంచి […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 5, 2021 / 01:50 PM IST
    Follow us on

    Strange Disease: నిద్రకు ప్రాణులకు దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి ప్రాణి రోజులో ఎంతో కొంత సేపు నిద్ర పోతుంది. నిద్ర లేకపోతే అనారోగ్యం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఓ మహిళ 40 ఏళ్లు నిద్ర లేకుండా ఉండడం గమనార్హం. మనలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతుంటారు. శరీర తీవ్రత దృష్ట్యా నిద్ర మనకు మేలు చేస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని తెలుసు. చికిత్స తీసుకున్నా ఆమె ఈ సమస్య నుంచి బయటపడడం లేదు. విభిన్నమైన ఆమె తీరు గురించి అందరు తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. నిద్ర లేకపోతే ఎలా బతుకుందని ప్రశ్నిస్తున్నారు. నిద్ర మాత్రలు వేసుకున్నా ఆమెపై ప్రభావం చూపడం లేదట.

    చైనా హెవాన్ ప్రావిన్స్ లో నివసించే జ్యానింగ్ అనే మహిళ (45) గత 40 ఏళ్లుగా నిద్ర పోవడం లేదు. నిద్ర లేమి సమస్యతో బాధపడుతోంది. ఒక్క సెకను కూడా నిద్ర పోవడం లేదు. ఎప్పుడో 5-6 ఏళ్ల వయసుల ఉన్నప్పుడు బాగా నిద్ర పోయినట్లు గుర్తుందని చెబుతోంది. ఈ వింత వ్యాధితో ఇప్పటివరకు ఒక్క క్షణం కూడా నిద్ర పోవడం లేదని తెలిపింది. దీన్ని తన భర్త కూడా అంగీకరించాడు.

    పెళ్లయిన నాటి నుంచి ఇప్పటి వరకు జ్యానింగ్ నిద్ర పోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండడంతో టైం పాస్ చేయడం వంటి పనులు చేయడం, టీవీ చూస్తూ ఉంటుందన్నారు. ప్రారంభంలో ఈ సమస్య నుంచి బయటపడడం కోసం జ్యానింగ్ భర్త నిద్ర మాత్రలు తీసుకువచ్చినా ఫలితం లేదన్నాడు. కానీ ఆమె మీద పెద్ద ప్రభావం చూపడం లేదని చెబుతున్నాడు.

    ఏ ప్రాణి అయినా నిద్ర పోకుండా బతకడం కష్టమే. కానీ ఆమె మాత్రం నలభై ఏళ్లుగా నిద్ర లేకపోయినా హాయిగా ఉంటోంది. ఆమెకు నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏవైనా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఎప్పుడో ఒక సమయంలో ఆమె కచ్చితంగా నిద్రపోతుందని చెబుతున్నారు. రాత్రి కాకపోతే పగలైనా ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.