మహారాష్ర్టలోని చంద్రాపుర జిల్లాలో మరోటి కాక్రే(34) నివాసం ఉంటున్నాడు. అతడు రెండు సంవత్సరాల క్రితం ప్రజాక్త (25)ను వివాహం చేసుకున్నాడు. కాక్రే ప్రముఖ వెస్ర్టన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో వారి సంసారం సజావుగానే సాగింది. అయితే ప్రజాక్తకు చెడు బుద్ధి పుట్టింది. సోదరి స్వప్న భర్త సోదరుడు సంజయ్ టిక్లే తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలుసుకోవడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. దీంతో విషయం భర్త కాక్రేకు తెలిసింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు.
కాక్రే ఉద్యోగానికి వెళ్లిన సమయంలో సంజయ్ వచ్చి ప్రజాక్తతో బెడ్ రూంలో ఏకాంతంగా గడుపుతూ బిజీ అయిపోయారు. దీంతో సంజయ్ తో కలిసి బయటకు వెళ్లి కూడా తన సుఖాలు తీర్చుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాక్రే తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజు తాగి వచ్చి ప్రజాక్తను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అతడి దెబ్బలకు తట్టుకోలేక ప్రజాక్త భర్తను తిరిగిరాని లోకాలకు పంపాలని నిశ్చయించుకుంది. తల్లి సహకారం కోరింది. భర్త చనిపోతే అతడి ఉద్యోగం తనకు వస్తుందని భావించి జీవితం సుఖాంతంగా ఉంటుందని ఆలోచించి కాక్రేను తదముట్టించాలని పథకం వేసింది.
కాక్రే హత్యకు పథకం వేసింది. అతడిని హత్య చేయడానికి సంజయ్, అతడి స్నేహితుడు వికాస్ వాగ్రాకు డబ్బులు అందజేసింది. దీంతో పథకంలో భాగంగా కాక్రేను వికాస్ పరిచయం చేసుకున్నాడు. కాక్రేకు పీకలదాకా మద్యం తాగించి ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని అటవీ ప్రదేశానికి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోశాడు. చనిపోయాక సంజయ్ అతడిని కారులో తీసుకెళ్లి కాక్రే పనిచేసే ప్రదేశానికి దగ్గరలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ వేశారు. కానీ అది బెడిసి కొట్టి పోస్టుమార్టం రిపోర్టులో విషయం వెలుగు చూసింది. సహజ మరణం కాదని హత్య అని తేలడంతో వారి కాల్ డేటా ఆధారంగా హంతకులు దొరికిపోయారు. చివరికి తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి అందరు బలయ్యారు.